Bigg Boss 9 Telugu : చరిత్ర సృష్టించిన సామాన్యుడు.. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్‌గా కళ్యాణ్ పడాల..
బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ గా కళ్యాణ్ పడాల నిలిచినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం సామాన్యుడు చరిత్ర సృష్టించినట్లుగా సమాచారం. కామనర్ గా ఎంట్రీ ఇచ్చి విజేతగా నిలిచాడు. ఇప్పుడు ఇదే విషయం నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. కళ్యాణ్ ఫ్యాన్స్ సంబరాలు స్టార్ట్ చేశారు. కామనర్ కప్పు గెలిచాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కళ్యాణ్ పడాల.. అలియాస్ పడాల పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించినట్లు తెలుస్తోంది. అడియన్స్ ఎదురుచూపులకు.. ఉత్కంఠకు తెరదించుతూ బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా కళ్యాణ్ పడాల నిలిచినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుంది. మొదటి నుంచి తనూజ, కళ్యాణ్ మధ్య తీవ్ర ఉత్కంఠ ఉండగా.. ఇప్పుడు కళ్యాణ్ విజేత అయినట్లు నెట్టింట ప్రచారం జరుగుతుంది. దీంతో కళ్యాణ్ ఫ్యాన్స్ నెట్టింట సంబరాలు చేస్తున్నారు. తనూజ, కళ్యాణ్ మద్ద చిన్న తేడా ఉందని.. దీంతో కళ్యాణ్ గెలిచినట్లు సమాచారం. తనూజ రన్నరప్ గా నిలిచింది.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : తనూజ చెవిలో శ్రీముఖి ఏం చెప్పింది.. ? ఏం లీక్ చేసింది భయ్యా.. నెటిజన్స్ ఆగ్రహం…
ఫస్ట్ కామనర్ గా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్.. మొదటి మూడు వారాలు పూర్తి నెగిటివిటీని మూటగట్టుకున్నాడు. కానీ నాలుగో వారం నుంచి వ్యూహం మార్చి.. టాస్కులలో అదరగొట్టేశాడు. తన ఆట తీరు, ప్రవర్తనతో రోజు రోజుకు తన గ్రాఫ్ పెంచుకుంటూ విన్నర్ టైటిల్ రైసులో దూసుకొచ్చాడు. ముఖ్యంగా తనూజ, ఇమ్మాన్యుయేల్ మధ్య గట్టి పోటీ ఇచ్చి చివరకు విజేతగా నిలిచాడు కళ్యాణ్.
ఇవి కూడా చదవండి : Actress : చిరంజీవి, రజినీతో బ్లాక్ బస్టర్ హిట్స్.. 55 ఏళ్ల వయసులోనూ ఒంటరిగా.. ఇప్పటికీ సినిమాల్లో యాక్టివ్..
ముఖ్యంగా ఫ్యామిలీ వీక్ తర్వాత కళ్యాణ్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. తన ఆట తీరుతో కట్టిపడేశాడు. తమ మాటలు.. టాస్కులలో అదరగొట్టిన తీరుతో విన్నర్ రేసులోకి వచ్చేశాడు. ఫస్ట్ ఫైనలిస్ట్ గా నిలిచి.. ఇప్పుడు బిగ్ బాస్ కప్పు గెలిచాడు. వేలాది మందిని దాటుకుని అగ్నిపరీక్షలో పాల్గొని.. అందులో ఫస్ట్ కామనర్ గా హౌస్ లోకి అడుగుపెట్టాడు.
ఇవి కూడా చదవండి : Tollywood : 11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. అయినా రూ.200 కోట్ల ఆస్తులు.. గ్లామర్ పాటలతోనే ఫేమస్..




