రాష్ట్రపతి నిలయంలో గ్రాండ్‌గా ‘ఎట్ హోమ్’.. గవర్నర్, సీఎం సహా మంత్రుల హాజరు
హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం సందడిగా సాగుతోంది. ఎట్ హోమ్ కార్యక్రమం గ్రాండ్‌గా జరిగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. తేనీటి విందుతో పాటు పసందైన తెలంగాణ వంటకాలకు అతిథులు ఫిదా అయ్యారు. చక్కని ఆతిథ్యం ఇచ్చారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు.

హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం సందడిగా సాగుతోంది. ఎట్ హోమ్ కార్యక్రమం గ్రాండ్‌గా జరిగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. తేనీటి విందుతో పాటు పసందైన తెలంగాణ వంటకాలకు అతిథులు ఫిదా అయ్యారు. చక్కని ఆతిథ్యం ఇచ్చారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు.
సికింద్రాబాద్ పరిధి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం ఘనంగా సాగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన తేనీటి విందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ ప్రసాద్ రావు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్ , కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.
ఆనవాయితీ ప్రకారం రాష్ట్రపతి వేసవిలో సిమ్లాలో విడిది చేస్తారు. అలాగే శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌లో పర్యటిస్తారు. ఈ క్రమంలోనే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము డిసెంబర్ 17వ తేదీన భాగ్యనగరానికి వచ్చారు. సికింద్రాబాద్ పరిధి బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో బస చేశారు. హైదరాబాద్ వేదికగా పలు అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. బొల్లారంలో నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమంలో గవర్నర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు,పలువురు ప్రముఖులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆత్మీయంగా మాట్లాడారు.
President Droupadi Murmu hosted an ‘At Home’ reception at Rashtrapati Nilayam, Secunderabad, Telangana. pic.twitter.com/tBIS6jdv19
— President of India (@rashtrapatibhvn) December 21, 2025
ఈ సందర్బంగా తేనేటి విందుతో పాటు పసందైన తెలంగాణ వంటకాలు హైలైట్‌గా నిలిచాయి. చక్కని ఆతిథ్యం ఇచ్చారని అధికారులు, సిబ్బందిని రాష్ట్రపతి అభినందించారు. ఇక పలు రంగాలకు చెందిన ప్రముఖులను కూడా ఎట్ హోం కార్యక్రమానికి రాష్ట్రపతి ఆహ్వానించారు. ఆహ్లాదకర వాతావరణంలో అతిథులంతా ఆత్మీయంగా గడిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అతిథులు ధన్యవాదాలు, అభినందలు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




