రోహిత్ శర్మ టీం ముంబైపై గెలిచారు.. కట్‌చేస్తే.. బీసీసీఐకి ఫిర్యాదు చేసిన జమ్మూ కాశ్మీర్ టీం.. ఎందుకంటే?
Ranji Trophy: రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని పటిష్టమైన ముంబై జట్టును ఓడించి జమ్మూకశ్మీర్ జట్టు ఆశ్చర్యపరిచింది. అయితే, మ్యాచ్‌లో కొన్ని అంపైరింగ్ నిర్ణయాలతో కలత చెందిన జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్, పేలవమైన అంపైరింగ్‌పై బీసీసీఐకి అధికారికంగా ఫిర్యాదు చేసింది. శ్రేయాస్ అయ్యర్ నాటౌట్, అబిద్ ముస్తాక్ ఎల్బీడబ్ల్యూ అవుట్ చేయడం వివాదాస్పదమైంది.

Jammu & Kashmir Beats Mumbai in Ranji Trophy: రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే వంటి స్టార్లతో అలరించిన జమ్మూ కశ్మీర్ జట్టు ముంబై జట్టును ఓడించి అద్భుత ప్రదర్శన చేసింది. స్టార్-స్టడెడ్ టీమ్‌ను ఓడించిన తర్వాత అసంతృప్తికి గురైన జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్.. మ్యాచ్ తర్వాత పేలవమైన అంపైరింగ్‌పై బీసీసీఐకి ఫిర్యాదు చేసింది. నిజానికి ఈ మ్యాచ్‌లో అంపైర్ ఇచ్చిన కొన్ని నిర్ణయాలు జమ్మూ కాశ్మీర్ జట్టుకు అసంతృప్తిని కలిగించగా, ఈ విషయం ఇప్పుడు బీసీసీఐ ముందు లేవనెత్తింది.
బ్యాడ్ అంపైరింగ్‌పై బీసీసీఐకి ఫిర్యాదు..
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (JKCA) అడ్మినిస్ట్రేటర్ అనిల్ గుప్తా టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఈ విషయంపై మాట్లాడారు. పేలవమైన అంపైరింగ్ గురించి బీసీసీఐకి అధికారిక ఫిర్యాదు చేశారు. ‘‘మ్యాచ్‌లో అంపైరింగ్‌పై బీసీసీఐకి అధికారికంగా ఫిర్యాదు చేశాం. అంపైర్లు ఇచ్చిన కొన్ని నిర్ణయాలు జమ్మూకశ్మీర్ జట్టుకు వ్యతిరేకంగా ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో, లెగ్-స్టంప్ వెలుపల బంతి ఉన్నప్పటికీ, మా జట్టు ఆటగాడు అబిద్ ముస్తాక్‌ను అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఇచ్చాడు. అప్పుడు శ్రేయాస్ అయ్యర్ వికెట్ కీపర్ చేతికి స్పష్టంగా క్యాచ్ ఇచ్చినా అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు. నేను మ్యాచ్ వీక్షించే గ్రౌండ్‌లో ఉన్నాను. కాబట్టి, కొన్ని అంపైరింగ్ నిర్ణయాలతో నేను నిరాశకు గురయ్యాను” అని అతను చెప్పుకొచ్చాడు.
నాటౌట్ తీర్పుపై కలత..
జమ్ముకశ్మీర్ ఆటగాడు అబిద్ ముస్తాక్‌ను ఎల్‌బీడబ్ల్యూ ఔట్ చేయడంతో పాటు.. ఇరు జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ నాటౌట్ తీర్పు చాలా చర్చనీయాంశమైంది. రెండో ఇన్నింగ్స్‌లో శ్రేయాస్ అయ్యర్ ఎనిమిది పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంతి అతని బ్యాట్ అంచుకు తగిలి వికెట్ కీపర్ వద్దకు వెళ్లింది. బంతి బ్యాట్ అంచుకు తగిలిన శబ్దం కూడా స్పష్టంగా వినిపించింది. అయ్యర్ వికెట్ పడటంతో జమ్మూ కాశ్మీర్ ఆటగాళ్లు కూడా సంబరాలు చేసుకోవడం ప్రారంభించారు. కానీ అంపైర్ మాత్రం శ్రేయాస్ నాటౌట్ అని తేల్చాడు.
అంపైర్‌తో అయ్యర్ వాగ్వాదం..
శ్రేయాస్ 17 పరుగుల వద్ద కూడా, అతను స్టంప్స్ వెనుక వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఈ సమయంలో అయ్యర్‌ను అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. అయితే, ఈ నిర్ణయంతో మనస్తాపానికి గురైన అయ్యర్.. అంపైర్‌తో చాలాసేపు వాగ్వాదానికి దిగాడు. అయితే చివరకు మైదానం వీడాల్సి వచ్చింది. ఈ రెండు నిర్ణయాలపై అంపైర్ సుందరం రవి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ మ్యాచ్‌లో సుందరం రవితో పాటు నవదీప్ సింగ్ కూడా అంపైర్‌గా వ్యవహరించారు. మ్యాచ్‌కి నితిన్ గోయల్ రిఫరీగా వ్యవహరించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..