ODI Cricket: ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు.. వన్డే క్రికెట్‌లో బౌలర్ల తాట తీసిన నలుగురు భారత ఆటగాళ్లు
ODI Cricket: ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు.. వన్డే క్రికెట్‌లో బౌలర్ల తాట తీసిన నలుగురు భారత ఆటగాళ్లుMost Runs in Single Over in ODI Cricket: వన్డేల్లో పరుగుల కురిపించే ఎందరో బ్యాటర్లు ఉన్నారు. అయితే, వన్డే ఫార్మాట్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు గురించి ఇప్పడు తెలుసుకుందాం.. ఇందులో టీమిండియా బ్యాటర్లు కూడా ఉన్నారు. ఈ లిస్ట్‌లో ఎవరున్నారో ఓసారి చూద్దాం..

Most Runs in Single Over in ODI Cricket: ప్రపంచవ్యాప్తంగా బౌలర్లలో భారత బ్యాట్స్‌మెన్స్ భయం కనిపిస్తోంది. వన్డే క్రికెట్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్స్ ఎప్పుడూ ఎన్నో రికార్డులు సృష్టిస్తూనే ఉంటారు. వన్డే క్రికెట్‌లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన నలుగురు భారతీయ బ్యాట్స్‌మెన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జాబితాలో స్టార్ ప్లేయర్లు కూడా ఉన్నాయి. ఆ నలుగురు భారత బ్యాట్స్‌మెన్‌ల రికార్డులను ఒకసారి చూద్దాం..
1. శ్రేయాస్ అయ్యర్..
అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్. 2019లో విశాఖపట్నం వన్డేలో వెస్టిండీస్‌పై శ్రేయాస్ అయ్యర్ ఈ ఘనత సాధించాడు. రోస్టన్ చేజ్ వేసిన ఒక ఓవర్లో శ్రేయాస్ అయ్యర్ 31 పరుగులు చేశాడు. అందులో అతను 4 సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టాడు. ఈ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ 32 బంతుల్లో 53 పరుగులు చేశాడు.
2. సచిన్ టెండూల్కర్..
అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసినవారిలో సచిన్ టెండూల్కర్ రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ 1999లో న్యూజిలాండ్‌తో హైదరాబాద్ వన్డేలో క్రిస్ డ్రమ్ వేసిన ఒకే ఓవర్‌లో ఫోర్లు, సిక్స్‌లు కొట్టి 28 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో సచిన్ 150 బంతుల్లో 186 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
3. జహీర్ ఖాన్..
వన్డే క్రికెట్‌లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో జహీర్ ఖాన్ మూడో స్థానంలో ఉన్నాడు. 2000లో జోధ్‌పూర్ వన్డేలో జింబాబ్వేపై జహీర్ ఖాన్ ఈ ఘనత సాధించాడు. హెన్రీ ఒలంగా వేసిన ఒక ఓవర్‌లో జహీర్ ఖాన్ 4 సిక్సర్లు బాది మొత్తం 27 పరుగులు చేశాడు. జహీర్ ఖాన్ ప్రపంచంలోని గొప్ప బౌలర్లలో ఒకడిగా పేరుగాంచాడు.
4. వీరేంద్ర సెహ్వాగ్..
వీరేంద్ర సెహ్వాగ్ ప్రపంచంలోని గొప్ప బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచాడు. అతను ప్రపంచంలోని ప్రతి మైదానంలో పరుగులు సాధించాడు. అతను చాలా దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన వారిలో వీరేంద్ర సెహ్వాగ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. అతను శ్రీలంకపై ఒక ఓవర్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 26 పరుగులు చేశాడు. అతను 2005 సంవత్సరంలో కొలంబో మైదానంలో ఈ చరిష్మా చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..