AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: గూడు వద్దకు వచ్చి పిల్లల్ని కసకసా తినేసిన ముంగిస.. మేత తీసుకుని వచ్చిన ఆ తల్లి పక్షి..

అడవిలో ఎమోషన్స్ పెద్దగా ఉండవు. ఏ జీవి అయినా తన, తన పిల్లల ప్రాణాల్ని కాపాడుకోవడం.. కడుపు నింపుకోవడమే టాస్క్. ఈ క్రమంలోనే జాలి లేని బ్రూటల్ అటాక్స్ కెమెరా కంటికి చిక్కుతూ ఉంటాయి. అలాంటి ఓ వీడియో క్లిప్ మీ కోసం తీసుకొచ్చాం ...

Viral Video: గూడు వద్దకు వచ్చి పిల్లల్ని కసకసా తినేసిన ముంగిస.. మేత తీసుకుని వచ్చిన ఆ తల్లి పక్షి..
Skylark Babies
Ram Naramaneni
|

Updated on: Dec 21, 2025 | 7:26 PM

Share

అడవిలో రూల్స్ గురించి చెప్పేది ఏముంది…? బలమున్నోళ్లదే రాజ్యం. అక్కడ సర్వైవల్ కోసం నిత్యం ఫైట్ జరుగుతూ ఉంటుంది. కొన్ని అటాక్స్ చూస్తే.. మనకు జాలి అనిపిస్తుంది కానీ.. ఆకలి వేటలో అక్కడ ఇది సర్వసాధారణం. ఇప్పుడు మీకు అలాంటి.. గుండెల పగిలే దృశ్యాన్ని తీసుకొచ్చాను. స్కైలార్క్ పక్షి గడ్డి బాగా ఉన్న ప్రాంతంలో ఓ గూడు కట్టి.. అందులో పిల్లల్ని పొదిగింది. ఆ బుజ్జి బుజ్జి పిల్లలికి ఆహారం తెచ్చేందుకు అది బయటకు వెళ్లింది. ఈ సమయంలోనే ఓ ముంగిస ఆహారం కోసం వెతుక్కుంటూ ఆ గూడు వద్దకు వచ్చింది. ఆపై ఆ గూడు నుంచి పక్షి పిల్లల్ని బయటకు లాగి బతికి ఉండగానే కసకసా నమిలి తినేసింది. తీరిగ్గా తినేసిన అనంతరం అక్కడి నుంచి జారుకుంది. ఈ దృశ్యాలు ఆ గూడు వద్ద ఫిక్స్ చేసిన కెమెరాలో రికార్డయ్యాయి. కొంత సమయంలో తర్వాత ఆహారాన్ని తీసుకుని తల్లి పక్షి అక్కడికి వచ్చింది. పిల్లలు అక్కడ లేకపోవడంతో గూడు చుట్టూ వెతుక్కుంది. ఆ సమయంలో ఆ పక్షిని చూస్తే కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. పాపం ఆ తల్లి బుజ్జి బుజ్జి పిల్లల్ని కోల్పోవడంతో.. ఎంత ఆవేదనకు గురైందో వీడియోలో కనిపించింది. పక్షుల ప్రపంచంలో జరిగే రోజువారీ పోరాటాలను, ప్రకృతిలోని సహజమైన వేట ప్రక్రియను ఈ వీడియో బ్రూటల్‌గా చూపించింది.

వీడియో దిగువన చూడండి.. క్రెడిట్.. Brids with me