- Telugu News Photo Gallery Cricket photos Team Indai T20I Captain Suryakumar Yadav Poor Form in T20I Format check here full reason
సూర్య బ్యాట్ మౌనం వెనుక అసలు కారణం అదేనా.. వాళ్లు లేకుంటే టీమిండియా నుంచి ఔట్?
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత జట్టు 19 మ్యాచ్‌లు ఆడింది. ఈసారి భారత జట్టు 16 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అయితే, ఈ విజయంలో సూర్య బ్యాట్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఎందుకంటే, సూర్యకుమార్ యాదవ్ గత 12 మ్యాచ్‌ల్లో 242 పరుగులు మాత్రమే చేశాడు.
Updated on: Jan 26, 2025 | 2:35 PM

Suryakumar Yadav: భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్‌తో బాధపడుతున్నాడు. గత కొన్నేళ్లుగా టీ20 క్రికెట్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన సూర్య.. ప్రస్తుతం పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు. గత 10 ఇన్నింగ్స్‌ల్లో అతడు చేసిన మొత్తం పరుగులే ఇందుకు నిదర్శనంగా మారాయి.

టీ20 ప్రపంచ కప్ 2024 తర్వాత, సూర్యకుమార్ యాదవ్ భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆ తర్వాత సూర్య 12 మ్యాచ్‌లు ఆడాడు. అయితే, ఆయన ఎప్పుడూ 360 డిగ్రీ యాక్షన్‌తో కనిపించలేదు. ఎందుకంటే ఈ 12 ఇన్నింగ్స్‌ల్లో 24.50 సగటుతో మాత్రమే పరుగులు చేశాడు.

అంటే, సూర్యకుమార్ యాదవ్ గత 12 ఇన్నింగ్స్‌ల్లో 242 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 2022లో 1164 పరుగులు చేసిన సూర్య 2023లో 17 ఇన్నింగ్స్‌ల్లో 773 పరుగులు చేశాడు. 12 ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ సూర్య 250 పరుగులు చేయలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో సున్నాకే ఔటైన సూర్య.. రెండో మ్యాచ్‌లో 12 పరుగులు మాత్రమే చేసి తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్ తన పేలవమైన ఫామ్‌ను 2025లోనూ కొనసాగించాడు.

సూర్యకుమార్ యాదవ్ ఫామ్ దిగజారడానికి ప్రధాన కారణం అతనిపై అదనపు బాధ్యత అని ఇప్పుడు విశ్లేషిస్తున్నారు. అంటే, టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన జట్టుకు నాయకత్వం వహించే ఒత్తిడి అతనిపై ఉందని అంటున్నారు. దాని కారణంగా అతను పరుగులు చేయడంలో కష్టపడుతున్నాడు. మరి ఇంగ్లండ్‌తో ఆడిన 2 మ్యాచ్ ల్లో విఫలమైన సూర్య.. వచ్చే 3 మ్యాచ్‌లలో మళ్లీ పాత రిథమ్ లోకి వస్తాడో లేదో వేచి చూడాలి.





























