Indian Railways: రైల్వే ట్రాక్‌లో లూప్‌లైన్ అంటే ఏమిటి..? దీన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు? ఇంట్రెస్టింగ్ స్టోరీ!
Indian Railways: ఇతర రైళ్లకు మార్గం ఇచ్చేందుకు కీలక పాత్ర పోషించే ఈ లూప్‌లైన్‌లు సుమారు 750 మీటర్ల పొడవు ఉంటాయి. వీటిపై రెండు ఇంజన్లతో పాటు మొత్తం రైలును నిలిపే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 1500 మీటర్ల పొడవు ఉండే..

Indian Railways: రైల్వేలో చాలా ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. గత ఏడాది కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో 288 మంది మృతి చెందగా, వెయ్యి మందికిపైగా గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందు చెన్నైకు వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రధాన రైల్వే లైన్‌కు బదులు లూప్‌లైన్ మీదకు వెళ్లిందని రైల్వే శాఖ నివేదికలో పేర్కొంది. అయితే ఈ లూప్‌లైన్ అంటే ఏమిటో చాలా మందికి తెలియకపోవచ్చు. మరి లూప్‌లైన్ అంటే ఏమిటో తెలుసుకుందాం..
లూప్‌లైన్ అంటే ఏమిటి..? దానిని ఎందుకు ఏర్పాటు చేస్తారు..?
లూప్‌లైన్ అంటే ఏమిటనేది చాలా మందికి తెలియకపోవచ్చు. రైల్వే స్టేషన్ సమీపంలో ప్రధాన రైల్వే లైన్‌లను కలుపుతూ కొన్ని ఇతర ట్రాక్‌లు ఏర్పాటు చేస్తుంది రైల్వే. ఈ లైన్‌ల వల్ల స్టేషన్‌లో ఎక్కువ రైళ్లను నిలిపి ఉంచేందుకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా వేరే రైళ్లకు దారి ఇచ్చేందుకు ఈ లూప్‌లైన్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ లూప్‌లైన్‌ను కొంత దూరం వెళ్లిన తర్వాత మళ్లీ ప్రధాన లైన్‌కు కలుపుతారు.
ఇది కూడా చదవండి: Traffic Challans: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ట్రాఫిక్ చలాన్స్ రద్దు.. ఆ ప్రభుత్వం కీలక నిర్ణయం?
లూప్‌లైన్ ఎంత పొడవు ఉంటుంది?
ఇతర రైళ్లకు మార్గం ఇచ్చేందుకు కీలక పాత్ర పోషించే ఈ లూప్‌లైన్‌లు సుమారు 750 మీటర్ల పొడవు ఉంటాయి. వీటిపై రెండు ఇంజన్లతో పాటు మొత్తం రైలును నిలిపే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 1500 మీటర్ల పొడవు ఉండే లూప్‌లైన్‌ను ఏర్పాటు చేసేందుకు రైల్వే చర్యలు చేపడుతోంది. అంటే ఈ లూప్‌లైన్ పొడవు రెండింతలుగా ఉండేలా ఏర్పాటు చేస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








