Vizag: ఈ పక్షి జాడ చెబితే పారితోషికం..
విశాఖలో ఓ కుటుంబానికి పెంపుడు పక్షి అదృశ్యం తీవ్ర ఆవేదన మిగిల్చింది. కళ్లముందే ఎగిరిపోయిన విదేశీ జాతి పక్షి తిరిగి రాకపోవడంతో ఆ కుటుంబం కన్నీటి పర్యంతమవుతోంది. విశాఖ వేపగుంట రవినగర్‌కు చెందిన ఆనంద్ కుటుంబం నెలన్నర క్రితం హైదరాబాద్ నుంచి బ్లూ అండ్ గోల్డ్ మకావ్‌ను తీసుకొచ్చి ఎంతో ప్రేమగా పెంచుకుంటోంది.

విశాఖలో ఓ పెంపుడు పక్షి అదృశ్యమైంది. కళ్లముందే ఎగిరిపోయింది. ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న ఆ పక్షి తిరిగి రాకపోవడంతో ఆ కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది. సమాచారం అందిస్తే తగిన పారితోషికం కూడా ఇస్తామని ప్రకటించింది ఆ కుటుంబం. వివరాల్లోకి వెళ్తే.. విశాఖలోని వేపగుంట రవినగర్‌లో ఉంటున్న ఆనంద్ కుటుంబం.. నెలన్నర క్రితం విదేశీ పక్షి బ్లూ గోల్డ్ మకావ్‌ను కొనుగోలు చేసింది. దాన్ని హైదరాబాద్ నుంచి విశాఖ తీసుకొచ్చి.. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. శుక్రవారం ఉదయం సన్ రైజ్ అయిన తరువాత బయటకు తీసుకెళ్లారు. ఆ సమయంలో మకావ్ ఒక్కసారిగా ఎగిరిపోయింది. అప్పటి నుంచి ఆ కుటుంబం పక్షి కోసం గాలిస్తోంది. కనిపించిన వారందరికీ మకావ్ జాడ కోసం అడుగుతున్నారు. ఆనంద్ భార్య లావణ్య, కూతురు కండతడి పెడుతున్నారు. తీసుకొచ్చి నెలన్నరే అయినప్పటికీ అల్లారుముద్దుగా పెంచుకుంటున్నామని.. కుటుంబంలో మెంబర్‌లా కలిసిపోయిందని.. ఇప్పుడు అది లేకపోతే ఎంతో వెలితిగా ఉందంటూ ఆవేదన చెందుతున్నారు. ఆ పక్షి కాలికి ఓ రింగ్ ఉంటుందని గుర్తించేందుకు ఆనవాళ్లు చెబుతున్నారు. ఎవరైనా ఆ పక్షి ఆచూకి సమాచారం తగిన బహుమతి ఇస్తామని అంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




