ND vs NZ: టీ20 ప్రపంచకప్-2026 టార్గెట్‌గా.. న్యూజిలాండ్‌తో టీమిండియా సిరీస్.. షెడ్యూల్ ఇదిగో
2026 టీ20 ప్రపంచ కప్ కోసం ఇప్పటికే ప్రణాళికలు మొదలయ్యాయి. ఎందుకంటే ఈ టోర్నమెంట్ కు కేవలం ఏడు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో వరుసగా రెండో సారి పొట్టి ప్రపంచకప్ ను గెల్చుకోవడమే లక్ష్యంగా టీమిండియా ప్రణాళికలు రచిస్తోంది.

ఐసీసీ టి20 ప్రపంచ కప్ వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరుగుతుంది. ఈ టోర్నమెంట్ కు భారతదేశంతో పాటు శ్రీలంక దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. కాబట్టి భారత జట్టు వరుసగా రెండవ టైటిల్ గెల్చుకునేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. 2024లో వెస్టిండీస్, అమెరికాలో జరిగిన టీ20 ప్రపంచ కప్ ను టీమిండియా గెల్చుకుంది. ఇప్పుడు 2026 టి20 ప్రపంచ కప్ లోనూ అలాగే విజయకేతనం ఎగరవేయాలని భారత జట్టు భావిస్తోంది. ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్ కోసం టీమిండియా ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. టీ20 ప్రపంచ కప్ కు ముందు టీం ఇండియా వైట్ బాల్ సిరీస్ ఆడనుంది. ఇందుకోసం న్యూజిలాండ్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ సిరీస్ జనవరి 11 నుంచి జనవరి 30 మధ్య జరుగుతుంది. టూర్ లో భాగంగా ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ ల జరగనున్నాయి. టీ20 ప్రపంచ కప్ నకు ముందు ఈ సిరీస్ చాలా ప్రయోజనకరంగా ఉంటుందని టీమిండియా భావిస్తోంది.
T20 ప్రపంచ కప్ 2026 ఫిబ్రవరి 8, 2026 నుంచి మార్చి 8, 2026 వరకు జరుగుతుంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నమెంట్‌కు ముందు పటిష్టమైన న్యూజిలాండ్ జట్టుతో ఆడడం భారత జట్టుకు లాభిస్తుంది. ఈ సిరీస్ తర్వాత భారత జట్టు ఆటగాళ్ళు నేరుగా T20 ప్రపంచ కప్ లోకి ఆడనున్నారు. ప్రస్తుతం, భారత T20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ IPL 2025 టోర్నమెంట్‌లో అద్భుతంగా రాణించాడు. కాబట్టి అతని నాయకత్వంలో వరుసగా రెండవసారి టైటిల్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. మొదటిసారి, 20 జట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటాయి. మొత్తం 55 మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. ఈసారి టీ20 ప్రపంచకప్ పోరు మరింత రసవత్తరంగా సాగనుందని తెలుస్తోంది.
PL 2025 టోర్నమెంట్‌లో చాలా మంది యువ ఆటగాళ్లు మంచి ప్రదర్శన ఇచ్చారు. ఇందులో చాలా మందికి T20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్‌లో అవకాశం లభించవచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..