IND vs NZ: క్రికెట్ అభిమానుల ఆందోళన.. బహిరంగ క్షమాపణలు చెప్పిన మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్.. అసలు ఏమైందంటే?

పుణె వేదికగా గురువారం (అక్టోబర్ 24) నుంచి భారత్ ,న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్ మొదటి సెషన్ లో న్యూజిలాండ్ బ్యాటర్ల ఆధిపత్యం సాగింది. అయితే రెండు, మూడు సెషన్లలో టీమిండియా బౌలర్లు చెలరేగారు. ఫలితంగా కివీస్ తన మొదట ఇన్నింగ్స్ లో 259 పరుగులకు ఆలౌటైంది.

IND vs NZ: క్రికెట్ అభిమానుల ఆందోళన.. బహిరంగ క్షమాపణలు చెప్పిన మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్.. అసలు ఏమైందంటే?
Team India
Follow us
Basha Shek

|

Updated on: Oct 24, 2024 | 10:14 PM

భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పుణె వేదికగా రెండో మ్యాచ్ జరుగుతోంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ మైదానంలో ఇరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయిన టీమిండియా న్యూజిలాండ్ జట్టును తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌట్ చేయగలిగింది. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియానికి వచ్చిన అభిమానులు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎట్టకేలకు తమ తప్పును అంగీకరించిన మహారాష్ట్ర క్రికెట్ సంఘం అభిమానులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పింది. ఈ మ్యాచ్‌ని చూసేందుకు స్టేడియంకు వచ్చిన అభిమానులకు తాగునీటి కొరత ఏర్పడింది. నిర్వాహకులు సమయానికి వాటర్ బాటిళ్లను మైదానంలోకి తీసుకురాకపోవడంతో మైదానంలో కిక్కిరిసిన అభిమానులు తాగునీటి కోసం నానా తంటాలు పడాల్సి వచ్చింది. మండుతున్న ఎండలతో అల్లాడుతున్న అభిమానులు తమకు తాగునీరు అందకపోవడంతో మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అభిమానులకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

ఈ మ్యాచ్‌ని చూసేందుకు తొలిరోజు 18000 మంది అభిమానులు మైదానానికి చేరుకున్నారు. దీంతో గ్రౌండ్‌లో కాస్త సందడి నెలకొంది. వాస్తవానికి, ఈ మైదానంలో చాలా వరకు పైకప్పు లేదు. దీంతో ఎండలో కూర్చున్న అభిమానులు మొదటి సెషన్ తర్వాత వాటర్ బాటిల్ కొనడానికి వెళ్లారు. అయితే సకాలంలో వాటర్ బాటిళ్లు గ్రౌండ్‌కు అందకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే బూత్‌లో నీటి కోసం తొక్కిసలాట జరిగింది మరియు కొంత సేపు వేచి ఉన్న అభిమానులు MCAకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. ఇంతలో భద్రతా సిబ్బంది వాటర్ బాటిళ్లను పంపిణీ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచచారు. అలాగే స్టేడియం నగర శివార్లలో ఉండడంతో ఉదయం రద్దీ ఎక్కువగా ఉండడంతో వాటర్ లారీ గ్రౌండ్ వద్దకు ఆలస్యంగా రావడం వల్లే ప్రమాదం జరిగిందని పాలకమండలి స్పష్టం చేసింది.

ఈ ఘటనపై MCA సెక్రటరీ కమలేష్ పిసల్ మీడియాతో మాట్లాడుతూ, ‘ఈ అసౌకర్యానికి అభిమానులందరికీ మేం క్షమాపణలు చెబుతున్నాము. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రస్తుత నీటి సమస్యను పరిష్కరించాం. మధ్యాహ్న భోజన విరామ సమయంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో కొన్ని స్టాల్స్‌లో నీరు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. నీటి కంటైనర్లను నింపడానికి మాకు 15 నుండి 20 నిమిషాలు అవసరం. దీంతో నీటి సరఫరాలో జాప్యం జరుగుతోంది. అందుకే ప్రేక్షకులకు ఉచితంగా బాటిల్ వాటర్ ఇవ్వాలని నిర్ణయించాం’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..