AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Emerging Asia Cup 2024: సెమీస్‌ పోరుకు సిద్ధమైన భారత్.. ఆసియా కప్ ట్రోఫీపై కన్నేసిన తిలక్ వర్మ సేన

Emerging Asia Cup 2024: నేడు ఎమర్జింగ్ టీమ్ ఆసియా కప్ టోర్నీలో టీమిండియా ఏ జట్టు సెమీస్ ఆడేందుకు సిద్ధమైంది. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి, అగ్రస్థానంలో నిలిచిన భారత ఏ జట్టు.. ఆఫ్ఘానిస్తాన్ ఏ జట్టుతో ఆమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లొ గెలిచి, ఫైనల్ చేరేందుకు సమాయత్తమైంది.

Emerging Asia Cup 2024: సెమీస్‌ పోరుకు సిద్ధమైన భారత్.. ఆసియా కప్ ట్రోఫీపై కన్నేసిన తిలక్ వర్మ సేన
India A Vs Afghanistan A, Semi Final 2
Venkata Chari
|

Updated on: Oct 25, 2024 | 7:14 AM

Share

Emerging Asia Cup 2024: ఒమన్‌లో ఎమర్జింగ్ టీమ్ ఆసియా కప్ లీగ్ దశ ముగిసింది. ఇప్పుడు సెమీ-ఫైనల్ మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. నేడు అంటే, అక్టోబర్ 25న తొలి సెమీస్‌ మ్యాచ్‌ పాకిస్థాన్‌-శ్రీలంక మధ్య జరగనుండగా, రెండో సెమీస్‌ మ్యాచ్‌ భారత్‌-అఫ్ఘానిస్థాన్‌ మధ్య జరగనుంది. గ్రూప్ ‘బి’లో అగ్రస్థానంలో నిలిచిన భారత్.. గ్రూప్ ‘ఎ’లో రెండో స్థానంలో నిలిచిన అఫ్గానిస్థాన్‌తో సెమీస్‌లో తలపడనుంది.

ఇండియా ఎ జట్టు తమ గ్రూప్‌లో అద్భుత ప్రదర్శన చేసి ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. లీగ్ దశలో ఆతిథ్య ఒమన్, యూఏఈ, పాకిస్థాన్ జట్లను టీమిండియా ఓడించింది. దీంతో పాయింట్ల పట్టికలో భారత జట్టు అగ్రస్థానంలో ఉంది. టీమిండియా బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శనతో పాటు ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. మరోవైపు ఆఫ్ఘనిస్థాన్ తమ గ్రూప్‌లో మూడు మ్యాచ్‌లు ఆడగా రెండు గెలిచి, ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.

మ్యాచ్‌కి సంబంధించిన పూర్తి సమాచారం మీకోసం..

భారత్ A వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ A మధ్య ఆసియా కప్ సెమీ-ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?

అల్ ఎమిరేట్స్ స్టేడియంలో శుక్రవారం, అక్టోబర్ 25న భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ఇండియా A వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ A మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

ఎమర్జింగ్ ఆసియా కప్‌లో భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సెమీ-ఫైనల్ శుక్రవారం, అక్టోబర్ 25న రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.

ఇండియా A వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ A మధ్య జరిగే సెమీ-ఫైనల్ మ్యాచ్‌ని టీవీలో ఏ ఛానల్‌లో చూడాలి?

రెండు జట్ల మధ్య జరిగే ఈ సెమీ ఫైనల్ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో వీక్షించవచ్చు.

ఇండియా A వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ A సెమీ ఫైనల్ మ్యాచ్‌ని మొబైల్‌లో చూడటం ఎలా?

మీరు మొబైల్‌లో హాట్‌స్టార్‌లో భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ A జట్ల మధ్య ఎమర్జింగ్ T20 ఆసియా కప్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌ని చూడవచ్చు.

రెండు జట్లు..

ఇండియా ఎ జట్టు: అభిషేక్ శర్మ, ప్రభాసిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), రమణదీప్ సింగ్, తిలక్ వర్మ (కెప్టెన్), అనుజ్ రావత్, హృతిక్ షోకీన్, సాయి కిషోర్, రాహుల్ చాహర్, ఆయుష్ బదోని, నెహాల్ వధేరా, రసిఖ్ దార్ సలామ్, అన్షుల్ కాంబోజ్, అకిబ్ ఖాన్ , వైభవ్ అరోరా, నిశాంత్ సింధు.

ఆఫ్ఘనిస్థాన్ జట్టు: జుబైద్ అక్బరీ, సైదుల్లా అటల్, దర్విష్ రసూలీ (కెప్టెన్), కరీం జనత్, షాహిదుల్లా కమల్, మహ్మద్ ఇషాక్ (వికెట్ కీపర్), షరాఫుద్దీన్ అష్రఫ్, ఖైస్ అహ్మద్, అల్లా ఘజన్ఫర్, ఫరీదున్ దావూద్జాయ్, బిలాల్ ఖాలియా, వాఫిలియా, వాఫిలియా, వఫిలియా షా, అబ్దుల్ రెహమాన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?