SRH: ఎవడొస్తారో రండిరా.! అక్కడున్నది కాటేరమ్మ కొడుకు.. ఐపీఎల్ ఫైనల్ శివాలెత్తాల్సిందే..

క్రికెట్‌లో అప్పుడప్పుడూ కొన్నిసార్లు ఆశ్చర్యానికి మించిన సంఘటనలు జరుగుతుంటాయి. ఎప్పుడైతే అనుకున్న స్కోర్ల కంటే తక్కువ నమోదవుతాయో.. అప్పుడప్పుడే కొన్నిసార్లు లాజిక్కులు, సెంటిమెంట్లు వర్కౌట్ అవుతుంటాయి. ప్రస్తుతం ఆ సెంటిమెంట్‌ చూసే SRH ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు.

SRH: ఎవడొస్తారో రండిరా.! అక్కడున్నది కాటేరమ్మ కొడుకు.. ఐపీఎల్ ఫైనల్ శివాలెత్తాల్సిందే..
Srh
Follow us

|

Updated on: May 26, 2024 | 12:13 PM

క్రికెట్‌లో అప్పుడప్పుడూ కొన్నిసార్లు ఆశ్చర్యానికి మించిన సంఘటనలు జరుగుతుంటాయి. ఎప్పుడైతే అనుకున్న స్కోర్ల కంటే తక్కువ నమోదవుతాయో.. అప్పుడప్పుడే కొన్నిసార్లు లాజిక్కులు, సెంటిమెంట్లు వర్కౌట్ అవుతుంటాయి. ప్రస్తుతం ఆ సెంటిమెంట్‌ చూసే SRH ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. క్వాలిఫైయర్-2లో రాజస్తాన్‌పై 36 పరుగులతో విజయం సాధించి.. ఆదివారం ఫైనల్‌లో కేకేఆర్‌తో తాడోపేడో తేల్చుకోనుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఈ క్రమంలోనే SRH తప్పక ఫైనల్‌లో గెలుస్తుందన్న సెంటిమెంట్ ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

గత సీజన్‌లో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఈ ఏడాది ఐపీఎల్‌ ఫైనల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. గతంలోనూ ఇదే సీన్ రిపీట్ అయిన సందర్భం లేకపోలేదు. అప్పుడూ ఇలాగే జరిగి ఏకంగా కప్పు ఎగరేసుకుని పోయింది. ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008లో డెక్కన చార్జర్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఆ వెంటనే 2009లో ఫైనల్‌కు చేరి.. ఐపీఎల్ ట్రోఫీని ఎగరేసుకునిపోయింది. ఇక తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఇదే సీన్ రిపీట్ చేస్తే.. అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నట్టే. 2023లో సన్ రైజర్స్ లీగ్ దశలోనే నిష్క్రమించి.. చివరి స్థానంలో నిలిచింది. ఇక ఇప్పుడు ఏకంగా ఫైనల్‌కు చేరింది.

ఈ ఒక్క సెంటిమెంట్ మాత్రమే కాదండోయ్.. 2009లో డెక్కన్ ఛార్జర్స్ కప్పు కొట్టడానికి కారణం ఆసీస్ కెప్టెన్.. ఆ తర్వాత 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కప్పు సాధించడానికి కారణం కూడా ఆస్ట్రేలియా కెప్టెన్. ఆడమ్ గిల్‌క్రిస్ట్, ఆ వెంటనే డేవిడ్ వార్నర్.. హైదరాబాద్ జట్టుకు ట్రోఫీలు అందించారు. ఇక ఇప్పుడు ప్యాట్ కమిన్స్.. ట్రోఫీ లోడింగ్.. ఆస్ట్రేలియా కెప్టెన్సీలో షేన్ వార్న్ రాజస్తాన్ రాయల్స్‌కి కప్పు అందిస్తే.. జార్జ్ బెయిలీ తొలిసారి పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్స్‌కు.. అలాగే పూణే వారియర్స్‌ను కూడా ఫస్ట్ టైం ఫైనల్‌కు చేర్చాడు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్. ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే.. ప్యాట్ కమిన్స్ మరో కప్పు తన ఖాతాలో వేసుకున్నట్టే.