AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: 12 రోజులు.. 6 మ్యాచ్‌లు.. లంకలో కొత్త శకం ప్రారంభించనున్న భారత జట్టు..

India Tour Of Sri Lanka 2024: టీ20 ప్రపంచకప్ ముగియడంతో ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. ఇలాంటి పరిస్థితుల్లో బీసీసీఐ మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ను టీమిండియా కొత్త కోచ్‌గా నియమించింది. శ్రీలంక పర్యటనతో గంభీర్ తన ప్రస్థానాన్ని ప్రారంభించనున్నాడు. ఈ పర్యటనలో భారత జట్టు 12 రోజుల్లో మొత్తం 12 మ్యాచ్‌లు ఆడనుంది.

Team India: 12 రోజులు.. 6 మ్యాచ్‌లు.. లంకలో కొత్త శకం ప్రారంభించనున్న భారత జట్టు..
Ind Vs Sl
Venkata Chari
|

Updated on: Jul 15, 2024 | 5:10 PM

Share

India Tour Of Sri Lanka 2024: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో టీమిండియా 42 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది. ఈ విజయంతో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు టీ20 సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. ఇప్పుడు జింబాబ్వే సిరీస్ ముగిసిన తర్వాత కూడా భారత ఆటగాళ్లకు విశ్రాంతి లభించడం లేదు. వెంటనే మరో సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం..

శ్రీలంకతో 6 మ్యాచ్‌లు..

భారత జట్టు ఈ నెలలో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. అక్కడ మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ టూర్ టీమ్ ఇండియాకు చాలా ప్రత్యేకమైనది. ఈ పర్యటన ద్వారా, గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా తన పదవీకాలాన్ని ప్రారంభించనున్నాడు. గత నెలలో రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆ టోర్నీతో రాహుల్ ద్రవిడ్ కోచ్ పదవీకాలం ముగిసింది. ఇటువంటి పరిస్థితిలో, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ను టీమిండియా కొత్త ప్రధాన కోచ్‌గా చేసింది.

భారత జట్టు శ్రీలంక పర్యటనను జులై 27న ప్రారంభించనుంది. శ్రీలంక పర్యటనలో భారత జట్టు 12 రోజుల్లో మొత్తం 12 మ్యాచ్‌లు ఆడనుంది. ముందుగా భారత్-శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. తొలి టీ20 27న, రెండో టీ20 28న, చివరి టీ20 జులై 30న జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటల నుంచి పల్లెకెలెలో జరుగుతాయి.

ఆ తర్వాత ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది. ఆగస్టు 2న తొలి వన్డే జరగనుంది. ఆ తర్వాత మిగిలిన రెండు వన్డేలు ఆగస్టు 4, 7 తేదీల్లో జరగనున్నాయి. మూడు వన్డే మ్యాచ్‌లు శ్రీలంక రాజధాని ఆర్.కె. ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. 50-50 ఓవర్ల ఈ వన్డే మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతాయి.

ఈ పర్యటనకు కెప్టెన్సీ ఎవరి చేతుల్లో?

శ్రీలంక పర్యటనకు భారత జట్టును ప్రకటించలేదు. మీడియా కథనాల ప్రకారం, ఈ వారంలో జట్టును ప్రకటించవచ్చు. ఈ పర్యటన కోసం భారత టీ20 జట్టు కెప్టెన్సీని హార్దిక్ పాండ్యాకు అప్పగించవచ్చు అని తెలుస్తోంది. అయితే వన్డే కమాండ్ కేఎల్ రాహుల్‌కు ఇవ్వవచ్చు అని అంటున్నారు. PTI నివేదిక ప్రకారం, రోహిత్ శర్మ ఈ పర్యటనకు వెళ్లడు. ప్రపంచకప్ తర్వాతే రోహిత్ టీ20 ఇంటర్నేషనల్ నుంచి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలంక పర్యటనలో టీ20లో హార్దిక్, వన్డేల్లో కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఉండొచ్చు అని తెలుస్తోంది.

భారత్-శ్రీలంక షెడ్యూల్..

జులై 27 – 1వ టీ20, పల్లెకెలె

జులై 28 – 2వ టీ20, పల్లెకెలె

జులై 30 – 3వ టీ20, పల్లెకెలె

ఆగస్టు 2 – 1వ వన్డే, కొలంబో

4 ఆగస్టు – 2వ వన్డే, కొలంబో

ఆగస్టు 7 – 3వ వన్డే, కొలంబో.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..