AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saeed Anwar: ‘మహిళలు అలా చేయడం వల్లే విడాకులు’..పాక్ మాజీ క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సయీద్ అన్వర్ వివాదంలో చిక్కుకున్నాడు. మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దంపతుల విషయంలో మహిళలనే బాధ్యులుగా చూపిస్తూ అన్వర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్రికెట్ అభిమానులు, నెటిజన్లు పాక్ మాజీ క్రికెటర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు

Saeed Anwar: 'మహిళలు అలా చేయడం వల్లే విడాకులు'..పాక్ మాజీ క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు
Saeed Anwar
Basha Shek
|

Updated on: May 16, 2024 | 4:33 PM

Share

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సయీద్ అన్వర్ వివాదంలో చిక్కుకున్నాడు. మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దంపతుల విషయంలో మహిళలనే బాధ్యులుగా చూపిస్తూ అన్వర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్రికెట్ అభిమానులు, నెటిజన్లు పాక్ మాజీ క్రికెటర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సయీద్ అన్వర్ మహిళా సాధికారత, మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం గురించి మాట్లాడారు. ఇదే సమయంలో వర్క్‌ఫోర్స్‌లో మహిళల భాగస్వామ్యంపై తన ఆలోచనలపై సయీద్ అన్వర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పాక్ లో విడాకుల శాతం పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన సయీద్ అన్వర్ ఇందుకు మహిళలే కారణమని వ్యాఖ్యానించాడు. మహిళలు ఇంటి బయటకు వెళ్లి పనిచేయడం, ఆర్థిక స్వాతంత్ర్యం వల్లే పాక్ లో రోజురోజుకు విడాకులు పెరిగిపోతున్నాయంటూ మతి లేని వ్యాఖ్యలు చేశాడు సయీద్.

 ‘మహిళలే సమాజాన్ని నాశనం చేస్తున్నారు’ “నేను ప్రపంచంలోని చాలా దేశాలను సందర్శించాను. నేను ఇప్పుడు ఆస్ట్రేలియా, యూరప్ నుండి తిరిగి వచ్చాను. కుటుంబాల పరిస్థితి దారుణంగా ఉంది. దంపతులు పోట్లాడుకుంటున్నారు. మహిళలు డబ్బు కోసం పని చేయాల్సిన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మహిళలు వర్క్‌ఫోర్స్‌లో భాగం కావడం సమాజాన్ని నాశనం చేసే గేమ్ ప్లాన్. ఈ కారణంగానే పాక్ తో పాటు పలు దేశాల్లో విడాకులు పెరిగిపోతున్నాయి’ అని పాక్ క్రికెటర్ వ్యాఖ్యానించాడు. కాగా అన్వర్ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. పాక్ క్రికెటర్లు మరోసారి తమ బుద్ధిని చూపించుకున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

భారత్‌పై 194 పరుగులు..

సయీద్ అన్వర్ పాకిస్థాన్ అత్యుత్తమ వన్డే బ్యాటర్. అతని పేరు మీద 20 సెంచరీలు ఉన్నాయి. 247 వన్డేల్లో 8,824 పరుగులు చేశాడు. 91 టెస్టుల్లో 11 సెంచరీలతో 4,052 పరుగులు చేశాడు. వన్డేల్లో వరుసగా మూడు సెంచరీలు చేసిన బ్యాటర్లలో సయీద్ అన్వర్ కూడా ఉన్నాడు. 1993లో షార్జాలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో శ్రీలంక, వెస్టిండీస్, శ్రీలంకపై సెంచరీ సాధించాడు సయీద్. ఇక వన్డేల్లో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 194 భారత్ పై సాధించినవే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..