Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: ‘కోహ్లీకి లాస్ట్ ఐపీఎల్ ఇదే.. ఆ టోర్నీతో క్రికెట్‌కు గుడ్ బై’..

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా? ఈ ప్రశ్నకు సమాధానం దొరికేసింది. టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియాకు విరాట్ కోహ్లీ దూరం కానున్నట్టు తెలుస్తోంది. 35 ఏళ్ల విరాట్‌కి.. ఇది చివరి టీ20 ప్రపంచకప్ కాగా.. ఈ మెగా టోర్నీ తర్వాత తన కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు..

Virat Kohli: 'కోహ్లీకి లాస్ట్ ఐపీఎల్ ఇదే.. ఆ టోర్నీతో క్రికెట్‌కు గుడ్ బై'..
Virat Kohli
Follow us
Ravi Kiran

|

Updated on: May 16, 2024 | 8:59 PM

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా? ఈ ప్రశ్నకు సమాధానం దొరికేసింది. టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియాకు విరాట్ కోహ్లీ దూరం కానున్నట్టు తెలుస్తోంది. 35 ఏళ్ల విరాట్‌కి.. ఇది చివరి టీ20 ప్రపంచకప్ కాగా.. ఈ మెగా టోర్నీ తర్వాత తన కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

తన రిటైర్మెంట్ గురించి మాట్లాడిన విరాట్ కోహ్లీ.. ‘ ఏ క్రీడాకారుడికైనా తన కెరీర్‌కి ఎప్పుడొక రోజు ముగింపు తేదీ ఉంటుంది. అప్పటిదాకా నేను టీమిండియా విజయాల కోసం సాయశక్తులగా ఒడ్డిస్తా. అయ్యో, ఆ రోజు నేనేం ఏం చేయలేదే.? అనే మాట రానివ్వను. నేను ఏ పనిని అసంపూర్తిగా వదిలివేయకూడదనుకుంటున్నాను. ఎప్పుడైతే నేను చేయలేనని అనిపిస్తుందో.. అప్పుడే నా కెరీర్‌కి ఫుల్ స్టాప్ పడ్డట్టే అని కోహ్లీ చెప్పాడు. ఈ ప్రకటనతో రాబోయే టీ20 ప్రపంచకప్ తర్వాత విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌ ఉండబోతుందోనని.. కచ్చితంగా తన కెరీర్‌లో ఐసీసీ ట్రోఫీని సాధించే.. క్రికెట్‌ను కోహ్లీ తప్పుకుంటాడని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.

టీ20 ప్రపంచకప్ తర్వాత భారత టీ20 జట్టు ఎంపికకు కోహ్లీని పరిగణనలోకి తీసుకోరన్న విషయం ఇప్పటికే తెలిసిన విషయం. అటు ఈ ఏడాది ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ సాధించకపోతే.. అటు టీ20 ప్రపంచకప్.. ఇటు ఐపీఎల్‌కు విరాట్ కోహ్లీ ఇక గుడ్‌బై చెప్పే అవకాశం ఉందని సమాచారం. విరాట్ కోహ్లీ వయసు 35 ఏళ్లు. ప్రస్తుతం ఉన్న ఫిట్‌నెస్ దృష్ట్యా మరో 2-3 ఏళ్ల పాటు విరాట్ క్రికెట్ ఆడగలడు. ఇక ఒక్కసారి రిటైర్మెంట్‌ను విరాట్ కోహ్లీ ప్రకటించాక.. మళ్లీ మైదానంలో కనిపించడు.

అద్భుతమైన ఫామ్‌లో కింగ్ కోహ్లీ..

ఈ ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటి వరకు మొత్తం 13 మ్యాచ్‌లు ఆడిన కింగ్ కోహ్లీ 66.10 సగటుతో మొత్తం 661 పరుగులు చేశాడు. అతడు ఒక సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలు చేశాడు. ఈ అద్భుత ఫామ్‌తో ఈసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుస్తాననే నమ్మకంతో ఉన్నాడు. 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో భాగమైన కోహ్లీకి ఇప్పటిదాకా టీ20 ప్రపంచకప్ గెలిచే అదృష్టం దక్కలేదు. చివరిసారిగా టీ20 ప్రపంచకప్‌లో సత్తా చాటేందుకు సిద్ధమైన కోహ్లి ట్రోఫీని కైవసం చేసుకుంటాడో లేదో వేచి చూడాలి.