AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఆ రన్స్ లెక్కకు రావు చిన్న! DRS వివాదంలో ఆ ఇద్దరిదే తప్పన్న CSK కోచ్ ఫ్లెమింగ్

ఉత్కంఠభరిత మ్యాచ్‌లో CSK కేవలం రెండు పరుగుల తేడాతో RCB చేతిలో ఓడింది. 17వ ఓవర్లో బ్రెవిస్‌ LBW అయిన తర్వాత రివ్యూ తీసుకోవడంలో జడేజా-బ్రెవిస్ ఆలస్యం చేశారనే వివాదం చోటు చేసుకుంది. కోచ్ ఫ్లెమింగ్ ఈ తప్పిదాన్ని కీలకంగా అభివర్ణించారు. రీప్లేల్లో బంతి స్టంప్స్‌ను మిస్ అవుతుండగా, సమయానికి డిఆర్‌ఎస్ తీసుంటే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డారు.

Video: ఆ రన్స్ లెక్కకు రావు చిన్న! DRS వివాదంలో ఆ ఇద్దరిదే తప్పన్న CSK కోచ్ ఫ్లెమింగ్
Fleming Csk
Narsimha
|

Updated on: May 04, 2025 | 5:01 PM

Share

ఒక ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో CSK కేవలం 2 పరుగుల తేడాతో RCB చేతిలో పరాజయం పాలవ్వగా, చివరి ఓవర్లలో చోటుచేసుకున్న డిఆర్‌ఎస్ (DRS) వివాదం మ్యాచ్‌ను ప్రభావితం చేసింది. ఈ ఘటనపై చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందిస్తూ, డివాల్డ్ బ్రెవిస్ తీసుకోవలసిన సమయానికి రివ్యూ తీసుకోకపోవడమే కీలక మలుపు అని తెలిపారు. CSK ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఈ పరిణామం చోటుచేసుకుంది. లుంగి ఎంగిడి వేసిన ఫుల్ టాస్ బంతి బ్రెవిస్ ప్యాడ్లపై తగలడంతో అంపైర్ వెంటనే LBWగా ఔట్ ఇచ్చాడు. ఆట నియమాల ప్రకారం, అవుట్ ఇచ్చిన వెంటనే బాల్ డెడ్‌గా మారుతుంది.. రివ్యూ తీసుకునేందుకు కేవలం 15 సెకన్ల సమయం మాత్రమే ఉంటుంది.

కానీ బ్రెవిస్, జడేజా ఇద్దరూ బంతి బౌండరీకి వెళ్లిందని భావించి ఒక పరుగు తీసారు. ఫీల్డింగ్ జట్టు నాన్-స్ట్రైకర్ ఎండ్ వద్ద డైరెక్ట్ హిట్‌తో వికెట్ టార్గెట్ చేసింది. చిన్న చర్చ అనంతరం బ్రెవిస్ రివ్యూ కోరేందుకు ప్రయత్నించగా అప్పటికే 15 సెకన్లు దాటి పోయింది. అంపైర్లు నితిన్ మెనన్, మోహిత్ కృష్ణదాస్ రివ్యూను నిరాకరించడంతో బ్రెవిస్ నిరాశగా, కంగారుగా ప్యావిలియన్‌కి వెనుదిరిగాడు. రన్ లేకుండానే ఔట్ అయ్యాడు (గోల్డెన్ డక్).

ఫ్లెమింగ్ స్పందన

మ్యాచ్ అనంతరం ఫ్లెమింగ్ మాట్లాడుతూ, “అది ఒక పెద్ద క్షణం. జడేజా, బ్రెవిస్ ఇద్దరితో మాట్లాడినప్పుడు వాళ్లు రన్ తీసేందుకే ఫోకస్ పెట్టారని, బంతి బౌండరీకి వెళ్లిందని ఊహించి రివ్యూకు ఆలస్యం అయ్యిందని తెలిపారు. అవుట్ ప్రకటించిన వెంటనే టైమర్ స్టార్ట్ అవుతుంది. ఆ సమయంలో రన్ తీయడంలో సమయం వృథా అయిపోయిందేమో అనే అనుమానం ఉంది” అన్నారు.

అలాగే, “అతనిని అవుట్‌గా ఇచ్చినప్పుడు మేము పరుగు కోల్పోయేవాళ్లమే కానీ వికెట్ మాత్రం కాపాడుకున్నట్లే అయ్యేది. ఆ ఐదు పరుగులు దొరికినట్లయితే, పరిస్థితి మారి ఉండేది. ఇది పెద్ద మ్యాచ్‌లో పెద్ద మలుపు” అన్నారు. దురదృష్టవశాత్తూ, రీప్లేలు చూపినట్లుగా ఆ బంతి స్టంప్స్‌ను మిస్సవుతుంది. అంటే బ్రెవిస్ సమయానికి డిఆర్‌ఎస్ తీసుకొని ఉంటే, అతను నాటౌట్ అయ్యేవాడు, గేమ్‌కి మరో మలుపు వచ్చేది.

ఈ మ్యాచ్‌లో RCB 213/5 స్కోరు చేసింది. షెపర్డ్ 53 పరుగులు, జాకబ్ బెతెల్ అరంగేట్రంలో 62, కోహ్లీ 55 రన్స్ చేశారు. ప్రత్యుత్తరంగా CSK తరఫున అయూష్ మాఠ్రే 94 పరుగులు చేసి పోరాడాడు, జడేజా అజేయంగా 77 చేశాడు. కానీ చివరకు CSK 211/6 వద్ద ఆగిపోయింది. ఈ గెలుపుతో RCB 11 మ్యాచుల్లో 8 విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్‌కి వెళ్లింది. మరోవైపు, CSK వరుసగా ఐదో పరాజయం చవిచూసి టేబుల్ చివర్లోనే నిలిచింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.