World Cup 2023: ‘అందుకే భయ్యా నువ్వంటే మాకిష్టం’.. వార్నర్ చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. వీడియో
ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు పెద్దగా స్కోరు చేయలేకపోయింది. జట్టు మొత్తం 43.3 ఓవర్లలో 209 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంకకు పాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్ శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. శ్రీలంక ఇన్నింగ్స్‌లో 32వ ఓవర్ తర్వాత వర్షం కురిసింది. వర్షం ఎక్కువగా ఉండటంతో మైదానంలో అంపైర్లు కవర్లతో కప్పివేయాలని సూచించారు. దీంతో కవర్లతో మైదానాన్ని కప్పేందుకు గ్రౌండ్ స్టాఫ్ బాగా ఇబ్బంది పడ్డారు.

ప్రపంచకప్-2023 భాగంగా లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఘన విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌కు వర్షం కూడా అంతరాయం కలిగించింది. వర్షం కారణంగా మ్యాచ్ రెండుసార్లు నిలిచిపోయింది. మొదటిగా శ్రీలంక జట్టు బ్యాటింగ్ మధ్యలో వర్షం కురిసింది. దీని తర్వాత, ఆస్ట్రేలియాఇన్నింగ్స్ ప్రారంభం కానున్న సమయంలో, వర్షం కూడా అంతరాయం కలిగించింది. అయితే కొంత సమయం తర్వాత వర్షం ఆగి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ప్రారంభమైంది. అయితే మొదటిసారి వర్షం పడినప్పుడు, ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ గ్రౌండ్ స్టాఫ్‌కు సహాయం చేస్తూ కనిపించాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు పెద్దగా స్కోరు చేయలేకపోయింది. జట్టు మొత్తం 43.3 ఓవర్లలో 209 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంకకు పాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్ శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. శ్రీలంక ఇన్నింగ్స్‌లో 32వ ఓవర్ తర్వాత వర్షం కురిసింది. వర్షం ఎక్కువగా ఉండటంతో మైదానంలో అంపైర్లు కవర్లతో కప్పివేయాలని సూచించారు. దీంతో కవర్లతో మైదానాన్ని కప్పేందుకు గ్రౌండ్ స్టాఫ్ బాగా ఇబ్బంది పడ్డారు. అప్పుడు వార్నర్ సహాయం చేయడానికి ముందుకు వచ్చి కవర్లను పిచ్‌పైకి తీసుకురావడంలో సహాయం చేశాడు. వార్నర్‌కి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో వార్నర్ అద్భుత క్యాచ్ కూడా అందుకున్నాడు. అతను నిస్సాంక అద్భుతమైన క్యాచ్ పట్టాడు. నిస్సాంక కమిన్స్ బంతిని పుల్ చేశాడు. డీప్ స్క్వేర్ లెగ్ వద్ద నిలబడి, వార్నర్ తన ఎడమవైపుకు పరిగెత్తి అద్భుతమైన డైవింగ్ క్యాచ్ పట్టాడు.
అయితే ఈ మ్యాచ్‌లో వార్నర్ బ్యాట్‌తో సత్తా చాటలేకపోయాడు. జట్టుకు శుభారంభం అందించాల్సిన సమయంలో ఎల్బీగా వెనుదిరిగాడు. దిల్షాన్ మధుశంక వార్నర్‌కు పెవిలియన్ దారి చూపించాడు. నాలుగో ఓవర్ తొలి బంతికే వార్నర్‌ను ఎల్‌బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. దీనిపై వార్నర్ రివ్యూ తీసుకున్నా ఫలితం ప్రతికూలంగా వచ్చింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. మూడు మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు రెండింటిలో ఓడిపోగా, శ్రీలంకపై విజయం సాధించి బోణి కొట్టింది.
గ్రౌండ్ స్టాఫ్ తో కలిసి..
— Sanju Here 🤞| Alter EGO| (@me_sanjureddy) October 16, 2023
5 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా..
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








