AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SA vs NED: మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన నెదర్లాండ్స్‌ కెప్టెన్‌.. దక్షిణాఫ్రికాకు భారీ లక్ష్యాన్నే ఇచ్చారుగా..

మొదట బ్యాటింగ్‌కు దిగిన డచ్‌ జట్టు సఫారీ బౌలర్ల ధాటికి 140 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే ఉన్నట్లుండి నెదర్లాండ్స్‌ ఆటగాళ్లు గేర్‌ మార్చారు. ఫోర్లు, సిక్స్‌లతో ప్రొటీస్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా స్కాట్ ఎడ్వర్డ్స్ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. 69 బంతుల్లో 79 పరుగులు చేసి దక్షిణాఫ్రికాకు ఓ మోస్తరు టార్గెట్‌ అందించాడు.

SA vs NED: మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన నెదర్లాండ్స్‌ కెప్టెన్‌.. దక్షిణాఫ్రికాకు భారీ లక్ష్యాన్నే ఇచ్చారుగా..
South Africa Vs Netherlands
Basha Shek
|

Updated on: Oct 17, 2023 | 8:02 PM

Share

వన్డే ప్రపంచకప్‌లో ఇవాళ (అక్టోబర్‌ 17) దక్షిణాఫ్రికా నెదర్లాండ్స్‌తో తలపడుతోంది. ధర్మశాలలో జరుగుతున్న ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో 43 ఓవర్లకే మ్యాచ్‌కు కుదించారు. అనుకున్నట్లే మ్యాచ్‌లో మొదట దక్షిణాఫ్రికాదే పైచేయి సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన డచ్‌ జట్టు సఫారీ బౌలర్ల ధాటికి 140 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే ఉన్నట్లుండి నెదర్లాండ్స్‌ ఆటగాళ్లు గేర్‌ మార్చారు. ఫోర్లు, సిక్స్‌లతో ప్రొటీస్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా స్కాట్ ఎడ్వర్డ్స్ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. 69 బంతుల్లో 79 పరుగులు చేసి దక్షిణాఫ్రికాకు ఓ మోస్తరు టార్గెట్‌ అందించాడు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించాలంటే 43 ఓవర్లలో 246 పరుగులు చేయాలి. అయితే డిపెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ను ఆఫ్ఘనిస్థాన్ ఓడించినట్లు నెదర్లాండ్స్‌ కూడా ఈ మ్యాచ్‌లో ఏదైనా అద్భుతం చేస్తుందా?లేదా? అన్నది మరికొన్ని క్షణాల్లో తేలిపోనుంది. వర్షం కారణంగా 43 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన నెదర్లాండ్స్ జట్టు 43 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది.

140 పరుగులకే ఏడు వికెట్లు.. అయినా.. భారీ స్కోరు..

ఇవి కూడా చదవండి

కాగా నెదర్లాండ్స్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ విక్రమ్‌జిత్ సింగ్ (2) త్వరగా అవుటయ్యాడు. రబాడ వేసిన బంతికి అతను పెవిలియన్‌ చేరాడు. ఆతర్వాత కూడా వెంట వెంటనే వికెట్లు పడిపోడంతో 50 పరుగుల్లోపే 3 కీలక వికెట్లు కోల్పోయింది డచ్‌ జట్టు. 11.3 ఓవర్ల తర్వాత అతని స్కోరు 43-3. రబడ రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్ జట్టుకు నాలుగో ఎదురుదెబ్బ తగిలింది. జెరాల్డ్ కోయెట్జీ కోలిన్ అకెర్‌మన్‌ను బౌల్డ్ చేశాడు. 50 పరుగుల వద్ద నెదర్లాండ్స్ వికెట్ పడిపోయింది. 15.1 ఓవర్ల తర్వాత అతని స్కోరు 50-4. ఆతర్వాత 26 ఓవర్లు ముగిసేసరికి నెదర్లాండ్స్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 105 పరుగులు.  ఆ తర్వాత సఫారీ బౌలర్లు మరింత రెచ్చిపోవడంతో 34 ఓవర్లలో 140 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది డచ్ టీమ్ . అయితే కెప్టెన్‌ స్కాట్ ఎడ్వర్డ్స్ తుపాన్‌ ఇన్నింగ్స్‌ తో దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 69 బంతుల్లో 79 పరుగులు చేసి దక్షిణాఫ్రికాకు భారీ టార్గెట్‌ ఇచ్చాడు. ఎడ్వర్డ్స్‌ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌ ఉన్నాయి.

రాణించిన లోయర్ ఆర్డర్ బ్యాటర్లు..

View this post on Instagram

A post shared by ICC (@icc)

ఎడ్వర్డ్స్ కెప్టెన్సీ ఇన్నింగ్స్..

View this post on Instagram

A post shared by ICC (@icc)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..