IPL 2024: దినేశ్ కార్తీక్ బాటలోనే! క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న మరో టీమిండియా ప్లేయర్!
ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోవడంతో డీకే కూడా అక్కడే ఆగిపోవాలని నిర్ణయించుకున్నాడు. అతను తన ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆర్సీబీకి ఎన్నో విజయాలు అందించాడు. టీమిండియా తరఫున కూడా చాలా మంచి ప్రదర్శనలు చేశాడు. ఇక డీకే బాటలోనే మరో టీమిండియా క్రికెటర్ రిటైర్మెంట్ దిశగా అడుగులు వేస్తున్నాడని తెలుస్తోంది
టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్ ఐపీఎల్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోవడంతో అతను కూడా అక్కడే ఆగిపోవాలని నిర్ణయించుకున్నాడు. అతను తన ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆర్సీబీకి ఎన్నో విజయాలు అందించాడు. టీమిండియా తరఫున కూడా చాలా మంచి ప్రదర్శనలు చేశాడు. ఇక డీకే బాటలోనే మరో టీమిండియా క్రికెటర్ రిటైర్మెంట్ దిశగా అడుగులు వేస్తున్నాడని తెలుస్తోంది. తన మెరుపు ఓపెనింగ్ తో టీమిండియాకు ఎన్నో మరపురాని విజయాలు అందించిన శిఖర్ ధావన్ త్వరలోనే క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఇదే విషయంపై స్పందించిన శిఖర్ ధావన్ ‘రాబోయే కొన్నేళ్లలో తాను రిటైర్మెంట్ తీసుకోవచ్చని క్లారిటీ ఇచ్చాడు. అంటే శిఖర్ ఇప్పట్లో రిటైర్మెంట్ ఆలోచనలో లేడని తెలుస్తోంది. ‘ నా క్రికెట్ కెరీర్ ఎక్కడ ముగుస్తుందని కచ్చితంగా చెప్పలేదు. కానీ ఆడటానికి కూడా ఒక నిర్దిష్ట వయస్సు ఉంటుంది. దురదృష్టవశాత్తు ఈ ఐపీఎల్ సీజన్‌లో నేను చాలా తక్కువ మ్యాచ్‌లు ఆడాను. ఫిట్‌గా ఉండటానికి సమయం పడుతుంది’ అని ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ చెప్పుకొచ్చాడు.
ఈ ఐపీఎల్ సీజన్‌లో శిఖర్ ధావన్ కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు. ఆ తర్వాత గాయం కారణంగా తప్పుకోవడంతో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శిఖర్ ధావన్ స్థానంలో సామ్ కుర్రాన్ పగ్గాలు స్వీకరించాడు. కాగా పేలవమైన ఫామ్ తో ఇబ్బంది పడుతోన్న శిఖర్ ధావన్ భారత క్రికెట్ జట్టులో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. అతను చివరిసారిగా 2022లో బంగ్లాదేశ్‌తో టీమిండియా తరఫున ఆడాడు. ఆ తర్వాత అతనికి అవకాశం రాలేదు. అతని స్థానంలో రోహిత్ శర్మతో పాటు భారత జట్టులో శుభ్‌మన్ గిల్ ఓపెనర్‌గా వ్యవహరిస్తున్నాడు. గాయం కారణంగా ఐపీఎల్‌లో శిఖర్ ధావన్ చాలా మ్యాచ్‌లు ఆడలేకపోయాడు.
MyTeam11 par Jeetne ke liye I am Fully Ready! Are you ready?⁰Join Chennai vs Bangalore on MyTeam11 & Win in Crores! ⁰Download MyTeam11 now – https://t.co/77SGRoMqIE ⁰.⁰#ChennaivsBangalore #IndianT20League #T20Cricket #FantasyCricket @MyTeam_11 pic.twitter.com/e4ha7BEFBD
— Shikhar Dhawan (@SDhawan25) March 21, 2024
ధావన్ తన అంతర్జాతీయ కెరీర్‌ను 2010లో ప్రారంభించాడు. అతను ఆస్ట్రేలియాతో తన మొదటి వన్డే మ్యాచ్ ఆడాడు. జూన్ 2011లో టీ20 అరంగేట్రం చేశాడు. టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసేందుకు రెండేళ్లు వేచి ఉండాల్సి వచ్చింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో 5 మ్యాచ్‌లు ఆడిన గబ్బర్ 125.62 స్ట్రైక్ రేట్‌తో 152 పరుగులు చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..