- Telugu News Photo Gallery Cricket photos These 4 Players Will Be Retianed By Sunrisers Hyderabad Before IPL 2025 Mega Auction
SRH: కోట్లు ఖర్చయినా పర్లేదన్న కావ్య పాప.. వచ్చే ఐపీఎల్‌కు ఆ నలుగురే SRH మాన్‌స్టర్‌లు..
ఐపీఎల్ 2024 లాస్ట్ లెగ్‌కు చేరింది. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ హైదరాబాద్, శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న కోల్‌కతా నైట్ రైడర్స్.. మే 26న చెన్నై వేదికగా జరిగే ఫైనల్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ రెండు జట్లు కూడా లీగ్ స్టేజిలో.. ఇతర జట్లపై తమ ఆధిపత్యాన్ని చూపించాయి. హోరాహోరీగా..
Updated on: May 25, 2024 | 6:42 PM

ఐపీఎల్ 2024 లాస్ట్ లెగ్‌కు చేరింది. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ హైదరాబాద్, శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న కోల్‌కతా నైట్ రైడర్స్.. మే 26న చెన్నై వేదికగా జరిగే ఫైనల్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.

ఈ రెండు జట్లు కూడా లీగ్ స్టేజిలో.. ఇతర జట్లపై తమ ఆధిపత్యాన్ని చూపించాయి. హోరాహోరీగా జరిగే ఐపీఎల్ 2024 ఫైనల్‌ను ఒక నిమిషం పక్కనపెడితే.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న సన్‌రైజర్స్ టీంలో వచ్చే ఐపీఎల్‌కు ఎవరెవరు ఉంటారన్నదే ఇప్పుడు ప్రశ్న.

దానికి సమాధానం దొరికేసింది. వచ్చే ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఈ నలుగురు మాన్‌స్టర్‌లను టీంలో అట్టిపెట్టుకుంటుందట. ఎవరూ ఊహించని విధంగా ఆ లిస్టులో నలుగురు పేర్లు ఉన్నాయి. కోట్లు ఖర్చయినా పర్లేదు.. ఈ నలుగురిని రిటైన్ చేసుకుంటానంటోంది కావ్య పాప. వారే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ప్యాట్ కమిన్స్, హెన్రిచ్ క్లాసెన్.

ఈ ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ వరకు చేరుకోవడంలో ఈ నలుగురు ప్రధానంగా కీలక పాత్ర పోషించారు. ఓపెనర్లుగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అదిరిపోయే ఓపెనింగ్ భాగస్వామ్యాలను అందించగా.. మిడిలార్డర్‌లో క్లాసెన్ సిక్సర్లతో ఊచకోత కోశాడు.

ఇక ప్యాట్ కమిన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్యాట్ అటు బంతితో.. ఇటు బ్యాట్‌తో ఆకట్టుకున్నాడు. అలాగే అవసరమైనప్పుడల్లా ప్యాట్ తన కెప్టెన్సీతో అదిరిపోయే వ్యూహాలతో ప్రత్యర్ధులను హడలెత్తించాడు.





























