Vinayaka Chavithi 2024: సకల జీవులను కాచే గణపయ్యకు 21 మంది కాపలా.. సీసీ కెమెరాలు ఏర్పాటు ఎందుకంటే
తళతళలా మెరుస్తూ కళకళ లాడే నోట్లతో సరికొత్త శోభను సంతరించుకున్న వినాయకుడి రూపం భక్తులను ఆకట్టుకుంటుంది. స్థానిక కోర్టు రోడ్డు ప్రాంతంలో శక్తి యువక మండలి సభ్యులు ఈ కరెన్సీ వినాయకుడిని ఏర్పాటు చేశారు. గత కొన్నేళ్లుగా వీరు ప్రతి ఏటా పూజకు అవసరం అయ్యే సామాగ్రితోనే, ఒక్కో సంవత్సరం ఒక్కో వెరైటీ రూపంలో వినాయకుడు విగ్రహం తయారు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
వినాయక చవితి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. వీధి వీధిల్లోని మండపాలలో గణపయ్య కొలువుదీరి భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. చవితి ఉత్సవాల సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో మట్టి వినాయకుడిని 54 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఇలా గణపయ్యను అలంకరించేందుకు గత కొన్ని నెలలుగా కొత్త నోట్లను వివిధ బ్యాంకుల నుంచి సేకరించినట్లు శక్తి వినాయక మండలి సభ్యులు తెలిపారు. తళతళలా మెరుస్తూ కళకళ లాడే నోట్లతో సరికొత్త శోభను సంతరించుకున్న వినాయకుడి రూపం భక్తులను ఆకట్టుకుంటుంది. స్థానిక కోర్టు రోడ్డు ప్రాంతంలో శక్తి యువక మండలి సభ్యులు ఈ కరెన్సీ వినాయకుడిని ఏర్పాటు చేశారు. గత కొన్నేళ్లుగా వీరు ప్రతి ఏటా పూజకు అవసరం అయ్యే సామాగ్రితోనే, ఒక్కో సంవత్సరం ఒక్కో వెరైటీ రూపంలో వినాయకుడు విగ్రహం తయారు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఈ విగ్రహం పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ విగ్రహం తయారీకి 54 లక్షలు ఖర్చు అయిందన్నారు. ఈ విగ్రహాన్ని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారని వినాయక మండలి నిర్వాహకులు తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లోని కోర్టు రోడ్డులో శ్రీ శక్తి వినాయక మండలి వారు 54 లక్షల కరెన్సీ నోట్లతో ధనేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వేలాదిమందిగా భక్తులు చూసి తరిస్తున్నారు. 25 రోజులపాటు 500, 200,50, 20,10 రూపాయల కరెన్సీ నోట్ల తో పాటు రెండు, ఒక రూపాయి నాణేలతో గణనాథుడిని తయారు చేశారు. ఈ ధనలక్ష్మి గణపతి రూపం చూపరులను అమితంగా ఆకర్షిస్తోంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..