Madhya Pradesh: చిల్డ్ బీర్ ఓపెన్ చేసి.. గ్లాసులో పోసుకున్నాడు.. కట్ చేస్తే.. ఓరి నాయనో
సమాచారం మేరకు ఇక్కడ నివసిస్తున్న సచిన్ అనే వ్యక్తి సమీపంలోని దుకాణంలో బీరు బాటిల్ కొనుగోలు చేశాడు. ఇంట్లో సీసాలోని బీరు గ్లాసులోకి పోయడం మొదలుపెట్టగానే ఓ విచిత్ర మైన వస్తువు కూడా బయటకు వచ్చింది. అది చనిపోయిన బల్లి అని సచిన్ గుర్తించారు. బల్లిని చూసి అరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా చేశాడు. ఆపై ఆ వ్యక్తి బాటిల్‌తో పాటు చనిపోయిన బల్లిని తీసుకుని దుకాణానికి చేరుకున్నాడు.
మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌లో ఓ వ్యక్తి తాగడం కోసం ఒక బీరు బాటిల్‌ను కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత బీరు బాటిల్ ఓపెన్ చేసి గ్లాసులో బీరు పోసుకోగానే స్పృహ కోల్పోయాడు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఓ వార్త ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. ఎందుకంటే గ్లాసు లో బీరు పోసుకోగానే అందులో చచ్చిన బల్లి కనిపించింది. ఆ వ్యక్తి వెంటనే మద్యం దుకాణానికి బీటు బాటిల్ ను ఆ గ్లాస్ ని తీసుకెళ్లాడు. దుకాణదారుడు ఈ విషయం విన్న వెంటనే తనపై విరుచుకు పడ్డాడు.. తనని దుర్భాషలాడాడని ఆరోపించాడు ఈ కస్టమర్. అంతేకాదు ఆ షాపు నుంచి బయటకు తోసేశాడని చెబుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఘటన బేతుల్‌లోని ముల్తాయ్ ప్రాంతానికి సంబంధించినది. సమాచారం మేరకు ఇక్కడ నివసిస్తున్న సచిన్ అనే వ్యక్తి సమీపంలోని దుకాణంలో బీరు బాటిల్ కొనుగోలు చేశాడు. ఇంట్లో సీసాలోని బీరు గ్లాసులోకి పోయడం మొదలుపెట్టగానే ఓ విచిత్ర మైన వస్తువు కూడా బయటకు వచ్చింది. అది చనిపోయిన బల్లి అని సచిన్ గుర్తించారు. బల్లిని చూసి అరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా చేశాడు. ఆపై ఆ వ్యక్తి బాటిల్‌తో పాటు చనిపోయిన బల్లిని తీసుకుని దుకాణానికి చేరుకున్నాడు.
షాపువాడికి విషయం మొత్తం చెప్పాడు. సదరు వ్యక్తి మాటలు వినగానే దుకాణదారుడు దుర్భాషలాడాడని ఆరోపించారు. షాప్ యజమాని అజాగ్రత్త వల్ల తన ప్రాణాలు పోయేవని చెప్పాడు. ఇది విన్న దుకాణదారుడికి కోపం వచ్చింది. ఆ వ్యక్తిని దుకాణం నుంచి బయటకు తోసేశాడు. దీంతో ఆ వ్యక్తి దుకాణం ముందు వీరంగం సృష్టించాడు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. అయితే తనకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎక్సైజ్ అధికారి అన్షుమన్ చాదర్ తెలిపారు.
విచారణ జరుగుతోంది
అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీల్ చేసిన బీర్ బాటిల్‌ను కొన్నట్లు సచిన్ చెప్పాడు. అటువంటి పరిస్థితిలో బీటిల్‌లోకి బల్లి ఎలా చేరింది అనేది పెద్ద ప్రశ్న. కాంట్రాక్ట్‌పై తాను ఫిర్యాదు చేయగా దుకాణదారు తనను దుర్భాషలాడి బయటకు గెంటేశాడని సచిన్ చెప్పాడు. దీనిపై ఎక్సైజ్ అధికారి అన్షుమన్ చాదర్ మాట్లాడుతూ.. మేము కూడా వీడియో చూశాము. బాటిల్ లోపల బల్లి ఎలా వచ్చిందో ఆరా తీస్తున్నాం.. అజాగ్రత్తగా ఉన్నవారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..