Viral: ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదు.. హృదయం చలించే ఘటన.
మహారాష్ట్ర లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. సకాలంలో వైద్యం అందక ఒకేసారి ఇద్దరు బిడ్డల్ని కోల్పోయారు ఆ తల్లిదండ్రులు. వారి కడుపుకోత వర్ణనాతీతం. అదిచాలదన్నట్టు ఆసుపత్రి నుంచి వారి మృతదేహాలను ఇంటికి తరలించేందుకు కనీస సౌకర్యం లేకపోవడం, బిడ్డల మృతదేహాలను భుజాలపై మోసుకుంటూ 15 కిలో మీటర్లు నడుచుకుంటూ వెళ్లిన ఘటన కంటతడి పెట్టిస్తోంది.

మహారాష్ట్ర లోని గడ్చిరోలిలోని అహేరి తాలుకాకు చెందిన ఓ జంట తమ బిడ్డల మృతదేహాలను మోసుకెళ్తున్న వీడియోను కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. పదేళ్లు కూడాలేని ఇద్దరు అన్నదమ్ములు జ్వరం బారినపడ్డారు. కానీ వారికి సకాలంలో చికిత్స అందలేదు. దాంతో ఆరోగ్యం క్షీణించింది. తర్వాత ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. చివరకు వారి మృతదేహాలను తరలించడానికి అంబులెన్స్ కూడా అందుబాటులో లేదు. చనిపోయిన పిల్లల్ని మోసుకుంటూ ఇంటికి చేరుకోవడానికి ఆ తల్లిదండ్రులు బురదనేలలో 15 కి.మీ నడవాల్సి వచ్చింది. ఈ ఘటనతో గడ్చిరోలిలోని ఆరోగ్యవ్యవస్థ దుస్థితి మరోసారి వెలుగులోకి వచ్చింది.. అంటూ సంకీర్ణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రమంతా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటూ బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారని, కానీ వారు క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తే వాస్తవాలు వెల్లడవుతాయని మండిపడ్డారు. అయితే ఆ తల్లిదండ్రుల పూర్తి వివరాలు తెలియరాలేదు. విదర్భ ప్రాంతంలో ఈ వారంలో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. అంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో ఓ గర్భిణి ఇంటివద్ద మృతశిశువుకు జన్మనిచ్చింది. తర్వాత నొప్పులు తాళలేక ఆ తల్లి కూడా ప్రాణాలు వదిలింది. ఈ వరుస ఘటనలతో మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.