Chanakya Niti: చాణక్యుడు చెప్పిన ప్రకారం ఈ 4 జీవుల నుంచి పాఠాలు నేర్చుకున్న మనిషి ఎన్నడూ సమస్యల బారిన పడరు

మనిషి తప్పులు చేయడం సహజం. తప్పులు చేయకుండా జీవితంలో ఎవరూ సంపూర్ణంగా ఉండలేరని అంటారు. అయితే చేసిన తప్పుల నుండి పాఠాలను నేర్చుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవచ్చు. ఆచార్య చాణక్యుడు 4 జంతువులు, పక్షుల తరహాలో జీవితానికి సంబంధించిన ముఖ్యమైన పాఠాలను అందించాడు. కుక్క, సింహం, కోకిల, కొంగల నుండి ఎవరైనా సరే తమ జీవితంలో అనేక విషయాలను నేర్చుకోవచ్చు అని చెప్పాడు.

Chanakya Niti: చాణక్యుడు చెప్పిన ప్రకారం ఈ 4 జీవుల నుంచి పాఠాలు నేర్చుకున్న మనిషి ఎన్నడూ సమస్యల బారిన పడరు
ధైర్యంగా పోరాడు అంటాడు చాణక్యుడు. జీవితంలో విజయం సాధించాలనుకుంటే ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. వీటిని అధిగమించడానికి మార్గంలో వచ్చిన అన్ని అడ్డంకులను తట్టుకోవాలి. కోడి పుంజు ఎల్లప్పుడూ మేల్కొని ఉంటుంది. తన శత్రువును గ్రహించిన క్షణంలో పోరాడటానికి సిద్ధంగా ఉంటుంది. ఎప్పుడూ తాను చేస్తున్న పోరాటాన్ని ఆపదు. సమస్యలకు భయపడదు. సంక్షోభం వచ్చినప్పుడు దృఢ సంకల్పంతో ఎదుర్కొనే వారు విజయం సాధిస్తారు.
Follow us
Surya Kala

|

Updated on: Sep 09, 2024 | 12:11 PM

జీవితమే ఒక తత్వశాస్త్రం. ప్రతి వ్యక్తి జీవితాన్ని భిన్నమైన పద్దతిలో చూస్తాడు. జీవిస్తాడు. జీవితాన్ని గడపడానికి అనేక మార్గాలు ఉండవచ్చు. దీని కోసం ఏ ఒక్క పద్దతి నిర్ణయించలేదు. అయితే పెద్దలు, మేధావులు, తత్వ వేత్తలు జీవితాన్ని జీవించడం సులభతరం చేయడానికి అనేక మార్గాలను చెప్పారు. మనిషి తప్పులు చేయడం సహజం. తప్పులు చేయకుండా జీవితంలో ఎవరూ సంపూర్ణంగా ఉండలేరని అంటారు. అయితే చేసిన తప్పుల నుండి పాఠాలను నేర్చుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవచ్చు. ఆచార్య చాణక్యుడు 4 జంతువులు, పక్షుల తరహాలో జీవితానికి సంబంధించిన ముఖ్యమైన పాఠాలను అందించాడు. కుక్క, సింహం, కోకిల, కొంగల నుండి ఎవరైనా సరే తమ జీవితంలో అనేక విషయాలను నేర్చుకోవచ్చు అని చెప్పాడు.

సింహం

సింహాన్ని అడవికి రాజుగా పరిగణిస్తారు. సింహం తన చివరి శ్వాస వరకు విజయం కోసం పోరాడుతుందని నమ్మకం. అదేవిధంగా మనుషులు కూడా ఎల్లప్పుడూ తన లక్ష్యం కోసం పూర్తిగా పోరాడాలి. విషయం కోసం మనసా వాచా అంకితభావంతో పని చేయాలి. లక్ష్యాన్ని సాధించే వరకు కష్టపడుతూనే ఉండాలి. తుది శ్వాస వరకు లక్ష్యాన్ని వదలకూడదు.

కుక్కలు

కుక్కలు విశ్వాసానికి ప్రతీక. అందుకే కుక్క అంటే మనుషులకు కూడా ఇష్టమే. కుక్క విధేయతకు ప్రసిద్ధి చెందింది. ఇది కాదు కుక్కలు స్నేహపూర్వక స్వభావం కలిగి ఉంటాయి. మనుషులతో త్వరగా కలిసిపోతాయి. అయితే కుక్కలో మరో ప్రత్యేక గుణం ఉంది. కుక్క నిద్రపోతున్న సమయంలో కూడా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. కుక్క నిద్రలో కూడా చిన్న శబ్ధమైనా సరే మేల్కొంటుంది. అదేవిధంగా మానవులు కూడా అప్రమత్తంగా ఉండాలి. తద్వారా అవసరమైనప్పుడు అపస్మారక స్థితిలో ఉండకుండా ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే తమను తాము రక్షించుకోగలరు.

ఇవి కూడా చదవండి

కోకిల

కోకిల స్వరం మధురంగా ఉంటుంది. కోకిల గొంతులోని మాధుర్యం, దూరం నుంచి విన్నా.. ఎవరి చెవులకు చేరినా అది భిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది. కోకిల గొంతులో మాధుర్యం మానవులను ఆకర్షిస్తుంది. అదేవిధంగా ఎవరి స్వరం అయినా మధురంగా ఉండాలి. మాట కూడా మధురంగా ఉండాలి. ఇలాంటి స్వరం ఉన్నవారు ఉద్యోగంలో మాత్రమే కాదు ఇతర పనిలో కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. మంచి మాటల వల్ల కుటుంబం, బంధువుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది.

కొంగ

కొంగకు గొప్ప సహనం ఉంటుంది. ఈ సంయమనం సహాయంతో కొంగ తన కడుపు నింపుకుంటుంది. జీవించగలుగుతుంది. కొంగకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. కొంగ చాలా కాలం పాటు ఓపికగా ఉండగలదు. అదే విధంగా మనిషికి కూడా ఓర్పు, స్వీయ నియంత్రణ ఉండాలి. మనిషికి ఓపిక లేకపోతే జీవితంలో మోసపోవచ్చు. చాలా సార్లు హడావుడిగా తీసుకునే నిర్ణయాలతో తప్పులు జరుగుతాయి. అటువంటి పరిస్థితిలో ప్రతి వ్యక్తీ తననిను తాను కొంగలా నియంత్రించుకోవలసి ఉంటుంది.