Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌ నౌషెరాలో చొరబాటుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులు హతం.. భారీగా మందు సామగ్రి స్వాధీనం

చొరబాట్లకు అవకాశం ఉందని నిఘా సంస్థలు, జమ్మూ కాశ్మీర్ పోలీసుల నుంచి అందిన సమాచారం ఆధారంగా భారత సైన్యం గత రాత్రి నౌషేరాలోని లామ్ ప్రాంతంలో చొరబాటు నిరోధక చర్యను ప్రారంభించింది. ఈ సమయంలో భారత్ లోకి అడుగు పెట్టడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులపై  భారత సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌ నౌషెరాలో చొరబాటుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులు హతం.. భారీగా మందు సామగ్రి స్వాధీనం
Jammu Kashmir Terrorists
Follow us
Surya Kala

|

Updated on: Sep 09, 2024 | 11:06 AM

జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు నౌషెరాలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. ఉగ్రవాదుల నుంచి భారీ ఎత్తున మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సమాచారాన్ని భద్రతా బలగాలు అందించాయి. ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ మరింత మంది ఉగ్రవాదులు దాగి ఉండవచ్చని సైనికులు అనుమానిస్తున్నారు.

చొరబాట్లకు అవకాశం ఉందని నిఘా సంస్థలు, జమ్మూ కాశ్మీర్ పోలీసుల నుంచి అందిన సమాచారం ఆధారంగా భారత సైన్యం గత రాత్రి నౌషేరాలోని లామ్ ప్రాంతంలో చొరబాటు నిరోధక చర్యను ప్రారంభించింది. ఈ సమయంలో భారత్ లోకి అడుగు పెట్టడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులపై  భారత సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఉగ్రవాదుల నుంచి రెండు AK-47లు మరియు ఒక పిస్టల్‌తో సహా భారీ మొత్తంలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇటీవల జమ్మూలోని సుంజ్వాన్ ఆర్మీ బేస్ వెలుపల ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక సైనికుడు గాయపడ్డాడు. అతను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించాడు. సుంజ్వాన్ బ్రిగేడ్ జమ్మూ నగరంలో అతిపెద్ద ఆర్మీ బేస్ క్యాంప్. దీనిని ఫిబ్రవరి 10, 2018న పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదు లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఆరుగురు సైనికులు, ఒక పౌరుడిని చంపారు.

జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల నేపథ్యంలో సైన్యం అప్రమత్తం..

అదే సమయంలో కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి)లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో కనీసం ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుప్వారాలోని మచిల్ సెక్టార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చగా, కుప్వారాలోని తంగ్‌ధర్ సెక్టార్‌లో మరో ఉగ్రవాది హతమైనట్లు భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్స్ తెలిపింది. గత మూడు నెలలుగా జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.

కేంద్ర పాలిత ప్రాంతంలో సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ ఎన్నికలకు ముందు భద్రతా బలగాలు ఉగ్రవాదుల జాడ ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసి పహారా అధికం చేశారు. కనిపించిన ఉగ్రవాదిని కనిపించినట్లు కాల్చి హతమార్చుతున్నారు. జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల విధుల కోసం దాదాపు 300 కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించారు. సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, అక్టోబర్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..