AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Navy Officer Arrest: పెళ్లి పేరిట నయవంచన.. హైదరాబాద్‌కు చెందిన నేవీ ఆఫీసర్‌ అరెస్ట్‌!

పెళ్లి పేరిట ఓ యవతిని వేధించినందుకు ఇండియన్‌ నేవీ ఆఫీసర్‌ పోలీసులు గత శుక్రవారం (సెప్టెంబర్ 6) అరెస్ట్ చేశారు. అరెస్టైన వ్యక్తిని హైదరాబాద్‌లోని జనగాంపల్లికి చెందిన రమావత్ సునీల్ నాయక్ (26)గా గుర్తించారు..

Indian Navy Officer Arrest: పెళ్లి పేరిట నయవంచన.. హైదరాబాద్‌కు చెందిన నేవీ ఆఫీసర్‌ అరెస్ట్‌!
Navy Officer Arrest
Srilakshmi C
|

Updated on: Sep 09, 2024 | 11:04 AM

Share

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 9: పెళ్లి పేరిట ఓ యవతిని వేధించినందుకు ఇండియన్‌ నేవీ ఆఫీసర్‌ పోలీసులు గత శుక్రవారం (సెప్టెంబర్ 6) అరెస్ట్ చేశారు. అరెస్టైన వ్యక్తిని హైదరాబాద్‌లోని జనగాంపల్లికి చెందిన రమావత్ సునీల్ నాయక్ (26)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

హైదరాబాద్‌కు చెందిన రమావత్‌ సునీల్‌ నాయక్‌ (26) కొచ్చిలోని ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌లో భారత నావికా దళానికి చెందిన లెఫ్టినెంట్‌ హోదీలో సేవలు అందిస్తున్నారు. అయితే రమావత్‌ గత కొన్ని నెలలుగా సోషల్‌ మీడియా వేదికగా బాధత యువతితో స్నేహం చేస్తున్నారు. పంజాబ్‌కు చెందిన బాధితురాలు సిమ్లాలో ఉద్యోగం చేస్తుంది. అయితే రమావత్‌ సూచనల మేరకు ఆమె కొచ్చి వచ్చింది. అక్కడ ఓ అద్దె ఇంట్లో ఇద్దరూ కొంతకాలం కలిసి ఉన్నారు. ఇంతలో అక్కడి సమీపంలోని కడవంతరలోని ఓ హోటల్‌లో ఉద్యోగం సంపాదించుకుంది. అనంతరం రమావత్‌ బాధిత యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆ తర్వాత కొంత కాలానికి పెళ్లి చేసుకోమని యువతి పట్టుబట్టేసరికి ఆమెపై సునీల్‌ నాయక్‌ భౌతిక దాడికి దిగాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 69 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో రమావత్‌ను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచగా, అతడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరో ఘటన: ఛత్తీస్‌గఢ్‌లో పిడుగుపాటు.. ఏడుగురి మృతి

దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌లోని బలోదాబాజార్‌-భాటాపారా జిల్లాలో విషాదం నెలకొంది. మోహ్ర గ్రామంలో ఆదివారం కురిసిన భారీ వర్షం కారణంగా పిడుగు పడింది. దీంతో అదే గ్రామానికి చెందిన ఏడుగురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులంతా పొలంలో పని చేస్తుండగా.. ఒక్కసారిగా పిడుగు పడినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.