Viral Video: నైట్‌ క్లబ్‌పై తుపాకులతో దుండగుల దాడి.. బౌన్సర్లను బెదిరించి లోనికెళ్లారు! కానీ.. ఊహించని ట్విస్ట్

దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొందరు దుండగులు ఓ నైట్‌ క్లబ్‌పై దాడి చేసి యజమాని నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించారు. ఆయుధాలతో క్లబ్‌ వద్దకు వచ్చిన దుండగులు అక్కడున్న బౌన్సర్లను బెదిరించి, క్లబ్‌ లోపలికి ప్రవేశించారు. అయితే క్లబ్‌ లోపల ఎవరూ లేకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. యజమానికి తిట్టుకుంటూ.. గాల్లో కాల్పులు జరుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఢిల్లీలో గురువారం అర్ధరాత్రి వేళ ఈ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన..

Viral Video: నైట్‌ క్లబ్‌పై తుపాకులతో దుండగుల దాడి.. బౌన్సర్లను బెదిరించి లోనికెళ్లారు! కానీ.. ఊహించని ట్విస్ట్
Open Fire At Delhi Club
Follow us

|

Updated on: Sep 08, 2024 | 5:06 PM

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 8: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొందరు దుండగులు ఓ నైట్‌ క్లబ్‌పై దాడి చేసి యజమాని నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించారు. ఆయుధాలతో క్లబ్‌ వద్దకు వచ్చిన దుండగులు అక్కడున్న బౌన్సర్లను బెదిరించి, క్లబ్‌ లోపలికి ప్రవేశించారు. అయితే క్లబ్‌ లోపల ఎవరూ లేకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. యజమానికి తిట్టుకుంటూ.. గాల్లో కాల్పులు జరుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఢిల్లీలో గురువారం అర్ధరాత్రి వేళ ఈ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే..

ఈశాన్య ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో ఉన్న కాంచ్ క్లబ్‌ వద్దకు గురువారం అర్ధరాత్రి వేళ ముగ్గురు దుండగులు అయుధాలతో వచ్చారు. అనంతరం గన్‌ తీసి ఓ వ్యక్తి.. అక్కడే ఉన్న మహిళతో సహా ఇద్దరు బౌన్సర్లను బెదిరించాడు. మోకాళ్లపై కూర్చోవాలని బెదిరించాడు. పైకి లేస్తే వారి తలలు పేల్చేస్తామని హెచ్చరించారు. దీంతో భయపడిపోయిన బౌన్సర్లు భయంతో మోకాళ్లపై కూర్చుండిపోయారు. అనంతరం మరో ఇద్దరు వ్యక్తులు ఆ క్లబ్‌లోకి వెళ్లి, యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేయాలని అనుకున్నారు. అయితే క్లబ్‌ లోపల ఎవరూ లేకపోవడంతో యజమానిని తిట్టుకుంటూ బయటకు వచ్చారు. క్లబ్‌ బయట గాల్లోకి పలు రౌండ్లు కాల్పులు జరిపి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు క్లబ్‌ వద్దకు చేరుకుని, సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు.

ఇవి కూడా చదవండి

నిందితుల్లో ఒకరిని ఘజియాబాద్‌కు చెందిన షారుక్‌గా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.