School Principal: వాట్సాప్ గ్రూప్‌ గణేశ్ పండగ పోస్ట్‌ డిలీట్‌.. ప్రభుత్వ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ అరెస్ట్!

వినాయక చవితి పండక్కి సంబంధించిన పోస్ట్‌ను వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి డిలీట్‌ చేసినందుకు ఓ ప్రభుత్వ స్కూల్‌ ప్రిన్సిపాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. మైనార్టీ వర్గానికి చెందిన సదరు ప్రిన్సిపల్ ఇలా రెండు సార్లు చేయడంతో టీచర్లు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాజస్థాన్‌లోని కోటాలో..

School Principal: వాట్సాప్ గ్రూప్‌ గణేశ్ పండగ పోస్ట్‌ డిలీట్‌.. ప్రభుత్వ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ అరెస్ట్!
Principal Arrested For Deleting Ganesh Festival Post
Follow us

|

Updated on: Sep 08, 2024 | 5:50 PM

జైపూర్‌, సెప్టెంబర్‌ 8: వినాయక చవితి పండక్కి సంబంధించిన పోస్ట్‌ను వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి డిలీట్‌ చేసినందుకు ఓ ప్రభుత్వ స్కూల్‌ ప్రిన్సిపాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. మైనార్టీ వర్గానికి చెందిన సదరు ప్రిన్సిపల్ ఇలా రెండు సార్లు చేయడంతో టీచర్లు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాజస్థాన్‌లోని కోటాలో శుక్రవారం (సెప్టెంబర్ 6) ఈ సంఘటన జరిగింది.

కోటాలోని ఓ ప్రభుత్వ స్కూల్‌కు చెందిన కొందరు హిందూ టీచర్లు తమ స్కూల్‌ స్కూల్‌ కమిటీ వాట్సాప్‌ గ్రూప్‌లో వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్ట్‌ చేశారు. ఈ స్కూల్‌కి మైనారిటీ వర్గానికి చెందిన ముహమ్మద్ షఫీక్ ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే టీచర్లు పెట్టిన పోస్టుల్లో అతడు ఒక పోస్ట్‌ను డిలీట్‌ చేశాడు. రెండోసారి మరొక పోస్టును కూడా డిలీట్‌ చేయడంతో ఆ స్కూల్‌లోని హిందువులైన కొందరు ఉపాధ్యాయులు, ఇతర సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్థానికులు, హిందూ సంఘాలతో కలిసి వారు ఆ స్కూల్‌ వద్ద బైఠాయించి నిరసనకు దిగారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ స్కూల్‌ వద్దకు చేరుకున్నారు. వెంటనే హిందూ టీచర్లు, స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సామాజిక సామరస్యానికి విఘాతం కలిగించేందుకు ప్రయత్నించినందుకు స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ముహమ్మద్ షఫీక్‌ను శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులను మోహరించారు.

చాలా పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, పాఠశాల ఉపాధ్యాయులు, బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, కొంతమంది సంరక్షకులు, ఇతర అధికారులతో కూడిన అభివృద్ధి కమిటీ ఉంది. ఈ కమిటీ కొన్ని ముఖ్యమైన విషయాల చర్చల నిమిత్తం వాట్సాప్ గ్రూప్‌లను నిర్వహిస్తుంది. అయితే గణేష్ చతుర్థి సందర్భంగా వాట్సప్‌ గ్రూప్‌లోని సభ్యులు శుక్రవారం ఉదయం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్‌లను షేర్ చేసుకున్నారు. అయితే, ప్రధానోపాధ్యాయుడు ముహమ్మద్ షఫీక్ తొలుత ఒక పోస్ట్‌ను తొలగించాడు. అనంతరం రెండు గంటల తర్వాత మరో పోస్ట్‌ను కూడా తొలగించాడు. దీంతో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, స్థానిక హిందూ సంఘాలకు చెందిన కొందరు వ్యక్తులు పాఠశాల ముందు చేరుకుని ప్రిన్సిపల్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని శాంతిభద్రతలను కాపాడటానికి అదనపు బలగాలను మోహరించారు. వాట్సాప్ గ్రూప్ సభ్యులు, గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ప్రిన్సిపాల్‌పై BNS సెక్షన్ 196 (మత సామరస్యానికి భంగం కలిగించడం) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే తాను గణేష్ ఫెస్టివల్‌ పోస్ట్‌లను వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి పొరపాటున డిలీట్‌ చేశానని సదరు స్కూల్‌ ప్రిన్సిపాల్‌ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే అతడు రెండోసారి కూడా అలాగే ఎందుకు చేశాడు అనే దానిపై ప్రశ్నించగా.. అతడు సమాధానం చెప్పలేదు. దీంతో పోలీసుల అరెస్ట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.