Viral Video: ఫిర్యాదు చేస్తే స్వీకరించలేదనీ.. ఏకంగా తహసీల్దార్‌ వాహనంపై పెట్రోల్ పోసి, తగలెట్టాడు! వీడియో

పృథ్వీరాజ్‌ అనే వ్యక్తి బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడు గత జులైలో ఓ ట్రిప్‌కు వెళ్లాడు. అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో అతడి తల్లి జులై 2న చల్లకెరె పోలీసులను సంప్రదించింది. తన కుమారుడు కనిపించకుండా పోయాడని, మిస్సింగ్‌ కేసు తీసుకోవాలని తెల్పింది. అయితే పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించేందుకు నిరాకరించారు. దీంతో చేసిదిలేక ఆమె వెనుదిరిగి..

Viral Video: ఫిర్యాదు చేస్తే స్వీకరించలేదనీ.. ఏకంగా తహసీల్దార్‌ వాహనంపై పెట్రోల్ పోసి, తగలెట్టాడు! వీడియో
Man Sets Tehsildar's Vehicle
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 06, 2024 | 6:47 PM

కర్ణాటక , సెప్టెంబర్‌ 6: కర్ణాటక రాష్ట్రంలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. తన తల్లి ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించడానికి పోలీసులు నిరాకరించడంతో ఓ యువకుడు కోపోధ్రిక్తుడై ఏకంగా తహసీల్దార్‌ వాహనంపై పెట్రోల్‌ పోసి, నిప్పు పెట్టాడు. ఈ ఘటన చిత్రదుర్గలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే..

పృథ్వీరాజ్‌ అనే వ్యక్తి బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడు గత జులైలో ఓ ట్రిప్‌కు వెళ్లాడు. అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో అతడి తల్లి జులై 2న చల్లకెరె పోలీసులను సంప్రదించింది. తన కుమారుడు కనిపించకుండా పోయాడని, మిస్సింగ్‌ కేసు తీసుకోవాలని తెల్పింది. అయితే పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించేందుకు నిరాకరించారు. దీంతో చేసిదిలేక ఆమె వెనుదిరిగి వెళ్లిపోయింది. కనిపించకుండా పోయిన పృథ్వీరాజ్‌ జులై 23న తిరిగొచ్చాడు. పోలీసులు తన తల్లి ఫిర్యాదును స్వీకరించని విషయాన్ని తెలుసుకుని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

ఇవి కూడా చదవండి

దీంతో జుల 23వ తేదీన పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం చల్లకెరె తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి ఆందోళన చేపట్టాడు. కార్యాలయం ముందున్న తహసీల్దార్‌ వాహనంపైకి ఎక్కి, పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. వెంటనే స్పందించిన కార్యాలయ సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. అనంతరం మంటలను ఆర్పి వేయడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పృథ్వీరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, వాహనాన్ని ధ్వంసం చేయడం, అధికారుల విధులకు ఆటంకం కలిగించినందుకు అతనిపై కేసు నమోదు చేశారు. తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది కూడా భయాందోళనలకు గురయ్యారు. కార్యాలయంలో విధులు నిర్వహించే సమయంలో తమకు రక్షణ కల్పించాలని కోరుతూ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)కి వినతిపత్రం సమర్పించారు. కాగా నిందితుడు పృథ్వీరాజ్‌పై ఈ ఏడాది ఆగస్టు 14న ఓ బైక్‌కు నిప్పంటించిన కేసులో ఇప్పటికే మరో కేసు నమోదైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఓరుగల్లు గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శపథం..!
ఓరుగల్లు గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శపథం..!
కుంభకర్ణుడిది అతి నిద్ర కాదట! పురాణ కథపై కొత్త ట్విస్ట్!
కుంభకర్ణుడిది అతి నిద్ర కాదట! పురాణ కథపై కొత్త ట్విస్ట్!
ఓట్లు వేయమని ఎంపీ ముఖం మీదే చెప్పిన మహిళ ..!
ఓట్లు వేయమని ఎంపీ ముఖం మీదే చెప్పిన మహిళ ..!
కాలరెగరేస్తున్న డాలర్.. మరి రూపాయి పరిస్థితి ఏంటి.?
కాలరెగరేస్తున్న డాలర్.. మరి రూపాయి పరిస్థితి ఏంటి.?
ఆమె మళ్లీ వచ్చింది .. పార్లమెంట్‌ దద్దరిల్లింది.! ఎంపీ డాన్స్
ఆమె మళ్లీ వచ్చింది .. పార్లమెంట్‌ దద్దరిల్లింది.! ఎంపీ డాన్స్
నిద్ర లేవగానే సెల్‌ఫోన్‌ చూస్తున్నారా.? నిపుణులు చెప్పినవి వింటే
నిద్ర లేవగానే సెల్‌ఫోన్‌ చూస్తున్నారా.? నిపుణులు చెప్పినవి వింటే
ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా.? మూసిన బంగారు గనిలో చిక్కు
ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా.? మూసిన బంగారు గనిలో చిక్కు
శివుడు కనిపిస్తాడని వెళ్తే.. ఎలుగుబంట్లు భయపెట్టాయి.! వీడియో..
శివుడు కనిపిస్తాడని వెళ్తే.. ఎలుగుబంట్లు భయపెట్టాయి.! వీడియో..
ఆ పులి.. ఈ పులేనా.? వైరల్‌ అవుతున్న పెద్దపులి వీడియో..
ఆ పులి.. ఈ పులేనా.? వైరల్‌ అవుతున్న పెద్దపులి వీడియో..
మంచుకొండపై మండుతున్న లావా.! ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్లాస్ట్!
మంచుకొండపై మండుతున్న లావా.! ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్లాస్ట్!