Boeing Starliner: స్టార్‌ లైనర్‌ నుంచి వింత శబ్దాలు.. మరో అంతరిక్ష నౌకలో సునీతా , బుచ్‌..

Boeing Starliner: స్టార్‌ లైనర్‌ నుంచి వింత శబ్దాలు.. మరో అంతరిక్ష నౌకలో సునీతా , బుచ్‌..

Anil kumar poka

|

Updated on: Sep 06, 2024 | 7:52 PM

మూడు నెలలుగా ఐఎస్‌ఎస్‌తో పాటే ఉండిపోయిన స్టార్‌లైనర్‌ నుంచి వింత శబ్ధాలు వస్తున్నాయని వ్యోమగామి బుచ్‌ విల్మోర్‌ చెప్పారు. ఆయన తాజాగా హ్యూస్టన్‌లోని నాసా మిషన్‌ కంట్రోల్‌తో టచ్‌లోకి వచ్చారు. మూడు నెలలుగా ఐఎస్‌ఎస్‌తో పాటే ఉండిపోయిన స్టార్‌లైనర్‌ నుంచి వింత శబ్ధాలు వస్తున్నాయని వ్యోమగామి బుచ్‌ విల్మోర్‌ చెప్పారు. ఆయన తాజాగా హ్యూస్టన్‌లోని నాసా మిషన్‌ కంట్రోల్‌తో టచ్‌లోకి వచ్చారు.

మూడు నెలలుగా ఐఎస్‌ఎస్‌తో పాటే ఉండిపోయిన స్టార్‌లైనర్‌ నుంచి వింత శబ్ధాలు వస్తున్నాయని వ్యోమగామి బుచ్‌ విల్మోర్‌ చెప్పారు. ఆయన తాజాగా హ్యూస్టన్‌లోని నాసా మిషన్‌ కంట్రోల్‌తో టచ్‌లోకి వచ్చారు. వ్యోమనౌకను బయటి నుంచి ఎవరో తడుతున్నట్లుగా, జలాంతర్గామిలోని సోనార్‌ వంటి శబ్దాలు పదేపదే వస్తున్నాయని చెప్పారు. స్టార్‌ లైనర్‌ అంతర్గత స్పీకర్‌ను తన మైక్రోఫోన్‌కు దగ్గరగా పెట్టి ఈ శబ్దాలను నాసా నిపుణులకు సైతం ఆయన వినిపించారు. ఆ శబ్దాలు ఎక్కడి నుంచి, ఎందుకు వస్తున్నాయో అంతుపట్టడం లేదని, తెలుసుకునేందుకు పూర్తి స్థాయిలో పరిశీలన జరుపుతున్నామని నాసా తెలిపింది. విద్యుదయస్కాంత తరంగాల ప్రభావం లేక ఆడియో సిస్టమ్‌ వల్ల ఈ వింత శబ్దాలు వచ్చే అవకాశముందని నిపుణులు అంటున్నారు.

భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌తో కలిసి బుచ్‌ విల్మోర్‌ జూన్‌ 5వ తేదీన స్టార్‌ లైనర్‌ స్పేస్‌క్రాఫ్ట్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. వారు 8 రోజులపాటు అక్కడే ఉండి ప్రయోగాలు చేపట్టిన అనంతరం భూమికి తిరిగి రావాల్సి ఉంది. అయితే, స్టార్‌ లైనర్‌లో థ్రస్టర్‌ వైఫల్యం, హీలియం లీకేజ్‌ వంటి సమస్యలు తలెత్తడంతో ఐఎస్‌ఎస్‌లోనే చిక్కుకుపోయారు. ఆ ఇద్దరినీ మరో అంతరిక్ష నౌకలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమికి తీసుకురావాలని ఇటీవలే నాసా నిర్ణయం తీసుకుంది. స్టార్‌లైనర్‌ను మాత్రం వ్యోమగాములు లేకుండానే ఖాళీగా ఈ నెల 6న తిరిగి రప్పించేందుకు ఏర్పాట్లు చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.