Viral: భార్యతో అలా చేయించాడు.. వీడిని నడిరోడ్డుపై ఉరితీసినా తప్పులేదు.!
కట్టుకున్న భార్యతో శాడిస్ట్‌లా ప్రవర్తించాడో భర్త. ఆమెకు డ్రగ్స్ ఇచ్చి.. పలువురితో అత్యాచారాలు చేయించాడు. ఆ దారుణాలను రికార్డు చేశాడు. ఈ అమానుష ఘటన ఫ్రాన్స్ లో బయటపడింది. తాజాగా ఈ కేసుపై మరోసారి విచారణ జరగ్గా.. నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. మరోవైపు బాధితురాలు ధైర్యంగా బయటికొచ్చి బహిరంగ విచారణ కోరుకుంటున్నారు.
కట్టుకున్న భార్యతో శాడిస్ట్‌లా ప్రవర్తించాడో భర్త. ఆమెకు డ్రగ్స్ ఇచ్చి.. పలువురితో అత్యాచారాలు చేయించాడు. ఆ దారుణాలను రికార్డు చేశాడు. ఈ అమానుష ఘటన ఫ్రాన్స్ లో బయటపడింది. తాజాగా ఈ కేసుపై మరోసారి విచారణ జరగ్గా.. నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. మరోవైపు బాధితురాలు ధైర్యంగా బయటికొచ్చి బహిరంగ విచారణ కోరుకుంటున్నారు. 71 ఏళ్ల నిందితుడు.. భార్య పట్ల 2011 నుంచి 2020 మధ్య దాదాపు పది సంవత్సరాల పాటు దారుణంగా వ్యవహరించాడు. రాత్రి పూట ఆమె తినే ఆహారంలో రహస్యంగా డ్రగ్స్ కలిపి తినిపించేవాడు. ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత ఇంటికి కొందరు వ్యక్తుల్ని రప్పించేవాడు. వారు ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతుంటే, రహస్య కెమెరాల్లో రికార్డు చేసేవాడు. ఇలా దాదాపు పదేళ్లపాటు ఆమెపై అకృత్యాలు కొనసాగాయి.
మొత్తం 72 మందితో 92 సార్లు ఆమెపై అత్యాచారం చేయించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ దురాగతాలకు పాల్పడిన వారి వయస్సు 26 నుంచి 73 ఏళ్ల మధ్యలో ఉంటుందని పోలీసులు తెలిపారు. వీరిలో 51 మందిని గుర్తించగా, మిగిలిన వారి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఈ కేసుపై బహిరంగ విచారణ చేపట్టాలని బాధితురాలు న్యాయస్థానాన్ని కోరింది. దశాబ్దం పాటు తనకు తెలియకుండానే తనపై దారుణాలు జరిగాయనీ ఇలాంటి వాటిపై మహిళలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పింది. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే దీనిపై బహిరంగ విచారణ జరగాలని ఆమె తెలిపింది. విచారణ నిమిత్తం ఆమె తన ముగ్గురు పిల్లలతో కలిసి కోర్టుకు హాజరైంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.