Viral: ఈతరాదు వదిలేయండన్నా అన్నా వినలేదు.. తాగిన మత్తులో స్విమ్మింగ్ పూల్‌లోకి తోసేసిన ఫ్రెండ్స్.
మద్యం మత్తులో తోటి కొలీగ్‌ని బలవంతంగా ఈతకొలనులో నెట్టగా మృతి చెందిన ఘటన హైదరాబాద్ ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మదాపూర్‌లో ఓ ఐటీ సంస్థలో టీం లీడర్‌గా పని చేస్తున్న శ్రీకాంత్ ఘట్కేసర్లోని ఓ గెస్ట్ హౌస్ లో పార్టీ ఇచ్చాడు. ఆదివారం సాయంత్రం ఉద్యోగులు మొత్తం 20 మంది వచ్చారు. అక్కడ మద్యం సేవించారు. రాత్రి 12గంటల తర్వాత కేక్ కట్ చేసి పార్టీ చేసుకున్నారు.
మద్యం మత్తులో తోటి కొలీగ్‌ని బలవంతంగా ఈతకొలనులో నెట్టగా మృతి చెందిన ఘటన హైదరాబాద్ ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మదాపూర్‌లో ఓ ఐటీ సంస్థలో టీం లీడర్‌గా పని చేస్తున్న శ్రీకాంత్ ఘట్కేసర్లోని ఓ గెస్ట్ హౌస్ లో పార్టీ ఇచ్చాడు. ఆదివారం సాయంత్రం ఉద్యోగులు మొత్తం 20 మంది వచ్చారు. అక్కడ మద్యం సేవించారు. రాత్రి 12గంటల తర్వాత కేక్ కట్ చేసి పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో అజయ్ తేజ అనే వ్యక్తిని అతని స్నేహితులు రంజిత్ రెడ్డి, సాయికుమార్ ఈత కొలనులోకి నెట్టేందుకు ప్రయత్నించారు. అందుకు అజయ్ తేజ తనకు ఈత రాదని వేడుకున్నాడు. అయినా వాళ్లిద్దరు వినలేదు. మద్యం మత్తులో అజయ్తేజ ఎంత ప్రాధేయపడ్డా వినిపించుకోలేదు. అతని మాటలు లెక్కచేయకుండా స్విమ్మింగ్ పూల్‌లోకి నెట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈతరాని అజయ్ తేజ మృతి చెందాడు. 45 నిమిషాల తర్వాత వారందరు పూల్ వద్దకు రాగా అపస్మారక స్థితిలో ఉన్న అజయ్చూసి కంగారు పడి వెంటనే జీడిమెట్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన డాక్టర్లు మృతి చెందాడని ధ్రువీకరించారు. సోమవారం తెల్లవారుజాము 3గంటల సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలికి చేరుకుని మృతిదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి మేనమామ కిశోర్‌కుమార్ ఫిర్యాదు మేరకు స్నేహితులు రంజిత్ రెడ్డి, సాయికుమార్, శ్రీకాంత్, గెస్ట్‌హౌస్ నిర్వాహకుడు వెంకటేశ్‌లపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

