Russian Spy: ఆ ‘రష్యా గూఢచారి తిమింగలం’ ఇక లేదు.! నార్వే ప్రజలకు బాగా మచ్చికైన బెలుగా..
రష్యా గూఢచారి పేరిట ఆరేళ్ల నుంచి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తూ వస్తున్న బెలుగా తిమింగలం తాజాగా చనిపోయింది. హవాల్దిమిర్‌గా పేరున్న ఈ తిమింగలం కళేబరం దక్షిణ నార్వేలోని నీటిపై తేలియాడుతూ స్థానికుల కంటబడింది. 14 అడుగుల పొడవు, 1,225 కిలోల బరువున్న హవాల్దిమిర్ కళేబరాన్ని క్రేన్‌తో బయటకు తీశారు. బెలుగా కళేబరంపై ఎటువంటి గాయాలు లేవని, మృతికి గత కారణాలను కనుగొనేందుకు పోస్టుమార్టం చేపట్టినట్లు అధికారులు చెప్పారు.
రష్యా గూఢచారి పేరిట ఆరేళ్ల నుంచి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తూ వస్తున్న బెలుగా తిమింగలం తాజాగా చనిపోయింది. హవాల్దిమిర్‌గా పేరున్న ఈ తిమింగలం కళేబరం దక్షిణ నార్వేలోని నీటిపై తేలియాడుతూ స్థానికుల కంటబడింది. 14 అడుగుల పొడవు, 1,225 కిలోల బరువున్న హవాల్దిమిర్ కళేబరాన్ని క్రేన్‌తో బయటకు తీశారు. బెలుగా కళేబరంపై ఎటువంటి గాయాలు లేవని, మృతికి గత కారణాలను కనుగొనేందుకు పోస్టుమార్టం చేపట్టినట్లు అధికారులు చెప్పారు. ఒంటిపై కెమెరాను అమర్చేందుకు వీలుగా బెల్టు లాంటి ఒక పరికరం అమర్చి ఉండటం, దానిపై సెయింట్ పీటర్స్‌బర్గ్ అని రాసి ఉండటంతో నార్వే ప్రజలకు అప్పట్లో అనుమానం వచ్చింది. రష్యాయే నిఘా కోసం ఈ తిమింగలాన్ని పంపి ఉంటుందని భావించారు. సాధారణంగా తిమింగలాలు గుంపులుగా సంచరిస్తుంటాయి. అందుకు విరుద్ధంగా ఈ బెలుగా ప్రజలకు మచ్చికైంది. ఇంతకీ, ఇది రష్యా పంపిందేనా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు. బహుశా, రష్యా నిర్బంధంలో ఉంటూ అనుకోకుండా తప్పించుకుని వచ్చి ఉంటుందని, అందుకే ప్రజల సంజ్ఞలకు స్పందించే లక్షణం అబ్బి ఉంటుందని కొందరు వాదిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్
శ్రీ వాసవీ మాతకు 102 ఋషి గోత్ర నామాలతో భారీ రుద్రాక్ష మాల సమర్పణ
పాల డబ్బాలో ఇరుక్కున్న తల.. ! రీల్స్ కోసం కష్టాలు..
స్వేచ్ఛ కోసం ఓ కుటుంబం సుదీర్ఘ పోరాటం.. చివరకు..
భార్య కోసం సర్వస్వం అర్పించిన భర్త కన్నీటి గాథ

