AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shivaji Statue: ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని తయారుచేసిన శిల్పి జైదీప్‌ అరెస్ట్‌.. గుట్టుగా పట్టించిన భార్య!

కొన్ని రోజుల క్రితం మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో శిల్పి జైదీప్‌ ఆప్టేని పోలీసులు అరెస్టు చేశారు. అతని భార్య ఇచ్చిన సమాచారంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సింధుదుర్గ్‌ జిల్లాలోని రాజ్‌కోట్‌ కోటలో ఏర్పాటు చేసిన 35 అడుగుల శివాజీ విగ్రహం ఆగస్టు 26న కుప్పకూలింది. దీంతో శిల్పి సహా పలువురిపై కేసు నమోదు చేశారు. పోలీసులు అరెస్ట్‌..

Shivaji Statue: ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని తయారుచేసిన శిల్పి జైదీప్‌ అరెస్ట్‌.. గుట్టుగా పట్టించిన భార్య!
Sculptor Jaydeep Apte
Srilakshmi C
|

Updated on: Sep 05, 2024 | 6:32 PM

Share

థానె, సెప్టెంబర్‌ 5: కొన్ని రోజుల క్రితం మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో శిల్పి జైదీప్‌ ఆప్టేని పోలీసులు అరెస్టు చేశారు. అతని భార్య ఇచ్చిన సమాచారంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సింధుదుర్గ్‌ జిల్లాలోని రాజ్‌కోట్‌ కోటలో ఏర్పాటు చేసిన 35 అడుగుల శివాజీ విగ్రహం ఆగస్టు 26న కుప్పకూలింది. దీంతో శిల్పి సహా పలువురిపై కేసు నమోదు చేశారు. పోలీసులు అరెస్ట్‌ చేస్తారనే భయంతో జయదీప్‌ పరారయ్యాడు. అతని కోసం పోలీసులు ఏడు బృందాలను ఏర్పాటు చేసి, ముమ్మరంగా గాలింపు చర్యలను చేపట్టారు. తాజాగా థానేలోని కల్యాణ్‌లోని అతని ఇంటి వద్ద అరెస్ట్ చేశారు. ట్విస్ట్ ఏంటంటే.. జైదీప్‌ తన కుటుంబాన్ని కలిసేందుకు కళ్యాణ్‌కు వస్తున్నాడని అతని భార్య పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు మాటు వేసి అతడిని అరెస్టు చేశారు.

జైదీప్‌ (39) జేజే స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో చదివాడు. అనంతరం 10 మంది స్నేహితులతో కలిసి కల్యాణ్‌ ప్రాంతంలో విగ్రహాల తయారీ సంస్థను నిర్వహిస్తున్నాడు. అయితే భారీ విగ్రహాలను తయారు చేయడంలో జైదీప్‌కు అనుభవం లేదని పోలీసులు గుర్తించారు. కేవలం చిన్న చిన్న విగ్రహాలు తయారు చేసిన అనుభవంతో 30 అడుగుల భారీ విగ్రహాన్ని ఎలా తయారు చేశాడనే దానిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి, విగ్రహం కూలిన తర్వాత పరారీలో ఉన్న జైదీప్‌ ఆచూకీపై 10 రోజుల క్రితమే పోలీసులకు సమాచారం అందింది. చివరకు పలానా రోజు ఇంటికి వస్తున్నట్లు భార్యకు సమాచారం ఇవ్వడంతో.. ఆమె చాకచక్యంగా ఈ విషయాన్ని పోలీసులకు చేరవేసింది. దీంతో బుధవారం అతని ఇంటి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.

గతేడాది నేవీ డే సందర్భంగా డిసెంబర్‌ 4న ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అయితే పది నెలలు గడువక ముందే ఆగస్టు నెల 26వ తేదీన అది కుప్పకూలింది. విగ్రహ ఏర్పాటులో పెద్దఎత్తున అవినీతి చోటుచేసుకున్నదని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసింది. శివాజీ విగ్రహం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.236 కోట్లు కేటాయిస్తే.. కేవలం రూ.1.5 కోట్లతో మాత్రమే ఖర్చు చేశారని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. అప్పటి నుంచి మహారాష్ట్రలోని సింధుదుర్గ్ పోలీసులు ఏడు బృందాలుగా గాలింపు చేపట్టారు. సింధుదుర్గ్ పోలీసుల బృందాలు ముంబై, థానే, కొల్హాపూర్ సహా పలు ప్రాంతాల్లో అతని కోసం వెతికాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్