Bodybuilder: 19 ఏళ్ల యువ బాడీబిల్డర్ గుండెపోటుతో మృతి.. అదే కారణం అంటోన్న సన్నిహితులు
గత కొంత కాలంగా ప్రపంచ వ్యాప్తంగా ఆకస్మిక గుండెపోటు మరణాలు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు వదులుతున్నారు. నెలల పసికందునుంచి పండు ముదుసలి వరకు అందరి గుండెలు మొరాయిస్తున్నాయి. ఎంతో భవిష్యత్తు కలిగిన యువత ప్రాణాలను అర్థాంతరంగా బలైపోతున్నాయి. తాజాగా బ్రెజిల్‌కు చెందిన ఓ టీనేజ్ బాడీబిల్డర్..
బ్రెజిల్, సెప్టెంబర్ 4: గత కొంత కాలంగా ప్రపంచ వ్యాప్తంగా ఆకస్మిక గుండెపోటు మరణాలు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు వదులుతున్నారు. నెలల పసికందునుంచి పండు ముదుసలి వరకు అందరి గుండెలు మొరాయిస్తున్నాయి. ఎంతో భవిష్యత్తు కలిగిన యువత ప్రాణాలను అర్థాంతరంగా బలైపోతున్నాయి. తాజాగా బ్రెజిల్‌కు చెందిన ఓ టీనేజ్ బాడీబిల్డర్ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఆదివారం మధ్యాహ్నం తన ఇంటిలో విగతజీవిగా కనిపించాడు.
దక్షిణ బ్రెజిల్‌లోని శాంటా కాటరినాలో నివాసం ఉంటున్న బాడీబిల్డర్ మాథ్యూస్ పావ్లక్ (19) చిన్నతనంలో ఉభకాయ సమస్యలతో బాధపడేవాడు. దీనిని అధిగమించేందుకు కేవలం ఐదేళ్లలో తన బాడీ షేప్‌ను పూర్తిగా మార్చేశాడు. బాడీబిల్డింగ్ కమ్యూనిటీలో చేరి పోటీలు ఇవ్వడం మొదలు పెట్టాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబర్చి నాల్గో స్థానంలో నిలిచాడు. అంతేగాకఇటీవల జరిగిన ప్రాంతీయ పోటీల్లో ఆరవ స్థానంలో నిలిచాడు. 2023లో మిస్టర్ యూ23 అనే పోటీలో పాల్గొని గెలుపొందాడు. అప్పటి నుంచి అతన్ని అందరూ ‘మిస్టర్ బ్లూమెనౌ’ అని పిలవడం ప్రారంభించారు.
మాథ్యూస్ బాడీ షేప్ సోషల్ మీడియాలో భీభత్సంగా వైరల్ అయ్యింది. ఇంత చిన్న వయస్సులో అతని ఆకట్టుకునే శరీరాకృతిని చూసి ప్రతి ఒక్కరూ షాక్‌కు గురయ్యారు. మాథ్యూస్ చిన్ననాటి ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. ‘మీ కల ఎంత కష్టమైనా, అసాధ్యమైనదైనా.. మీరు నిజంగా కోరుకుంటే, మీరు కోరుకున్నది సాధిస్తారు. అది నేను చేసాను.. మీరూ చేయగలరు’ అనే క్యాప్షన్ జోడించాడు. అయితే బాడీబిల్డింగ్‌కు అతను వినియోగించిన స్టెరాయిడ్స్ అతని పాలిట మృత్యు శకటాల్లా మారాయి. మాథ్యూస్ అనాబాలిక్ స్టెరాయిడ్స్ వినియోగించేవాడని, అందువల్లనే మరణించి ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఖచ్చితమైన కారణం ఏమిటో తెలియదుగానీ.. ఆదివారం ఉదయం అతని ఇంట్లో విగతజీవిగా పడి కనిపించాడు.
View this post on Instagram
పావ్లాక్ మాజీ ట్రైనర్ లూకాస్ చేగట్టి మాథ్యూస్ మృతి పట్ల తన బాధను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వ్యక్తం చేశాడు. ఓ గొప్ప స్నేహితుడిని కోల్పోవడంతో ఈ రోజు విచారకరంగా ముగిసింది. చాలా త్వరగా మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఎంతో అద్భుతమైన భవిష్యత్తు ఉంది. దేవుడి ప్రణాళికను మనం అర్ధం చేసుకోలేం. ఓ బ్రిలియంట్ అథ్లెట్‌ను కోల్పోయాం. నా మనసులో ఉన్న బరువును వివరించడానికి పదాలు సరిపోవడం లేదు. నేను మాథ్యూస్‌కి మొదటి కోచ్‌ని. అతన్ని నా కొడుకులా చూసుకునే అవకాశం వచ్చినందుకు నేను చాలా గర్వపడ్డాను. ఒక రోజు అతనితో నేను పోటీ పడతానని వాగ్దానం చేసాను. నిజంగానే.. మేము మొదటిసారి ఒకరితో ఒకరం పోటీ పడ్డాం. కానీ అతనే గెలిచాడని.. విచారం వ్యక్తం చేశారు. కాగా హైప్రొఫైల్ బాడీబిల్డర్ ఇలా గుండెపోటుతో మృతి చెందడం ఇదేం తొలిసారి కాదు. వీరు చేసే కఠినమైన కసరత్తులు దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలను చూపుతాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రముఖ బ్రెజిలియన్ బాడీబిల్డర్, ఫిట్‌నెస్ బోధకుడు జోనాస్ ఫిల్హో కేవలం 29 యేళ్ల వయసులో కోవిడ్‌తో పోరాడి మృతి చెందాడు. మేలో మేజర్‌కాన్ బాడీబిల్డర్ క్యాన్సర్ సర్వైవర్ కూడా 50 ఏళ్ల వయసులో మరణించాడు.