హిట్లర్‌ని మించి పాలిస్తున్న ఆ దేశాధ్యక్షుడు.. వరదల విధ్వంసాన్ని ఆపలేదంటూ 30 మంది అధికారులకు ఉరి శిక్ష
ఇటీవల ఉత్తర కొరియాలో భయంకరమైన వరదలు సంభవించాయి, ఇందులో 4 వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ప్రజల ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారీ ప్రాణ నష్టం జరిగింది, ఆ తర్వాత ఇప్పుడు దేశ పాలకుడు కింగ్ కిమ్ జోంగ్-ఉన్ వరదను ఆపలేకపోయిన నేరానికి తమ దేశ అధికారులకు జైలు శిక్ష విధించలేదు, జరిమానా విధించలేదు.. ఏకంగా నేరుగా ఉరి తీయబడ్డారు. అది కూడా ఒక్కరు కాదు ఇద్దరు కాదు 30 మంది అధికారులు ఉరి శిక్షను అనుభవించారు.
ప్రస్తుతం నియంత ఎవరు అంటే వెంటనే ఉత్తర కొరియా దేశాధ్యక్షుడు కింగ్ కిమ్ జోంగ్-ఉన్ గుర్తుకొస్తాడు. అలనాటి హిట్లర్ పాలనకు ఏ మాత్రం తగ్గని విధంగా రకరకాల రూల్స్.. శిక్షలతో దేశాన్ని పాలిస్తున్నాడు. అయితే ప్రస్తుతం చాలా దేశాలలో నేరాలకు ఉరి శిక్ష విధించడం కంటే జీవిత జైలు శిక్షను అమలు చేస్తున్నారు. చాలా తీవ్రమైన నేరం అనుకుంటేనే మరణశిక్ష విధించబడుతుంది. అదే సముయంలో చాలా దేశాల్లో మరణశిక్ష ను రద్దు చేశారు కూడా. అయితే తాజాగా ఉత్తర కొరియా దేశంలో తమ దేశ అధికారులకు మరణశిక్షను విధిస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచానికి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.
ఇటీవల ఉత్తర కొరియాలో భయంకరమైన వరదలు సంభవించాయి, ఇందులో 4 వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ప్రజల ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారీ ప్రాణ నష్టం జరిగింది, ఆ తర్వాత ఇప్పుడు దేశ పాలకుడు కింగ్ కిమ్ జోంగ్-ఉన్ వరదను ఆపలేకపోయిన నేరానికి తమ దేశ అధికారులకు జైలు శిక్ష విధించలేదు, జరిమానా విధించలేదు.. ఏకంగా నేరుగా ఉరి తీయబడ్డారు. అది కూడా ఒక్కరు కాదు ఇద్దరు కాదు 30 మంది అధికారులు ఉరి శిక్షను అనుభవించారు.
దేశంలో భయంకరమైన వరద వచ్చింది
జూలై నెలలో ఉత్తర కొరియాను వరదలు ముంచెత్తాయి, ఈ వరద చాంగాంగ్ ప్రావిన్స్‌లో భారీ వినాశనాన్ని కలిగించింది. ఈ విపత్తులో 4 వేల మంది ప్రాణాలు కోల్పోయారు, వరదల్లో ప్రజల ఇళ్లు ధ్వంసమయ్యాయి. చాలా మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లవలసి వచ్చింది.
30 మంది అధికారులను ఉరితీశారు
దక్షిణ కొరియా మీడియా ఈ విషయంపై స్పందిస్తూ .. ఉత్తర కొరియా అధికారులు వరదలను ఆపడానికి మరిన్ని చర్యలు తీసుకోగలరు. అయితే నిర్లక్ష్యం వహించిన ఉత్తర కొరియా అధికారులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. కానీ వారికి కఠినంగా శిక్షించబడుతుందని పేర్కొంది. ఈ ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాల్సి ఉంటుందని ఉత్తర కొరియా అధికారిని ఉటంకిస్తూ దక్షిణ కొరియా మీడియా పేర్కొంది.
దేశానికి ఎంత నష్టం వచ్చిందంటే
జూలైలో దేశంలో సంభవించిన వరదలను ఆపలేకపోయిన అధికారులను కఠినంగా శిక్షించాలని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఆదేశించినట్లు ఆ దేశ ఉత్తర కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కెసిఎన్ఎ) నివేదించింది. ఉత్తర కొరియా మీడియా ప్రకారం జూలై నెలలో దేశంలో సంభవించిన ప్రకృతి విపత్తులో, వరదలో 4 వేలకు పైగా ఇళ్లు కొట్టుకుపోగా, 7,410 ఎకరాల భూమి నాశనమైంది. అంతేకాకుండా రైల్వేలు, రోడ్లు కూడా దెబ్బతిన్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..