QR Code Scam: క్యూఆర్‌ కోడ్‌ స్కామ్‌లో రూ. 2 లక్షలు పోగొట్టుకున్న టెకీ.. OLX పేరిట ఘరానా మోసం

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకు సరికొత్త పంథాల్లో దాడులు చేస్తున్నారు. విచిత్రంగా చదువుకున్న వారే అత్యధికంగా సైబర్‌ నేరాలకు బలవుతున్నారు. స్కామర్లు రోజుకో తరహా స్కామ్‌తో రెచ్చిపోతున్నారు. ఆన్‌లైన్‌ వేదికగా అమాయకులను దోచేస్తున్నారు. తాజాగా బెంగళూరు చెందిన ఓ టెకీ ఇలాంటి ఉచ్చులో పడి ఏకంగా రూ.2 లక్షలు పోగొట్టుకున్నాడు. సాధారణంగా పాత వస్తువులను OLXలో చాలా మంది..

QR Code Scam: క్యూఆర్‌ కోడ్‌ స్కామ్‌లో రూ. 2 లక్షలు పోగొట్టుకున్న టెకీ.. OLX పేరిట ఘరానా మోసం
QR Code Scam
Follow us

|

Updated on: Sep 03, 2024 | 5:51 PM

బెంగళూరు, సెప్టెంబర్‌ 3: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకు సరికొత్త పంథాల్లో దాడులు చేస్తున్నారు. విచిత్రంగా చదువుకున్న వారే అత్యధికంగా సైబర్‌ నేరాలకు బలవుతున్నారు. స్కామర్లు రోజుకో తరహా స్కామ్‌తో రెచ్చిపోతున్నారు. ఆన్‌లైన్‌ వేదికగా అమాయకులను దోచేస్తున్నారు. తాజాగా బెంగళూరు చెందిన ఓ టెకీ ఇలాంటి ఉచ్చులో పడి ఏకంగా రూ.2 లక్షలు పోగొట్టుకున్నాడు. సాధారణంగా పాత వస్తువులను OLXలో చాలా మంది అమ్మేస్తుంటారు. అలాగే ఓ పాత వస్తువును అమ్మేందుకు యత్నించాడు. అంతే అకౌంట్‌ మొత్తం ఊడ్చేశారు. వివరాల్లోకెళ్తే..

బెంగళూర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సిద్దార్థ్ (27) ఆగస్ట్‌ 29న తన ఇంట్లోని పాత ఎయిర్‌ కూలర్‌ను విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. రూ. 5200 ప్రైస్‌ ట్యాగ్‌తో ఓఎల్‌ఎక్స్‌లో లిస్ట్‌ చేశాడు. యాడ్‌ను పోస్ట్ చేసిన కొద్దినమిషాలకే ఓ కాల్‌ వచ్చింది. వైట్‌ఫీల్డ్‌కు చెందిన ఫర్నీచర్‌ షోరూం యజమాని శ్రీకాంత్‌ వర్మ మాట్లాడుతున్నట్లు తనను తాను పరిచయం చేసుకున్నాడు. కూలర్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపాడు. అయితే డబ్బు చెల్లించే ప్రక్రియ సిద్దార్ధ్‌ను అనుకోని చిక్కుల్లో పడేసింది. పేమెంట్‌ స్వీకరించేందుకు ఓ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలని చెబుతూ.. సిద్ధార్ద్‌ మొబైల్‌కి రూ.5 క్యూఆర్‌కోడ్‌ను పంపాడు. ఈ క్రమంలో సిద్ధార్ధ్‌ క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయగా.. అతని అకౌంట్లో రూ.5 జమయ్యాయి. ఆపై సిద్ధార్ధ్‌కు శ్రీకాంత్‌ వర్మ రూ. 5,200కు మరో క్యూఆర్‌ కోడ్‌ పంపాడు. అయితే సిద్ధార్ధ్‌ దానిని కూడా స్కాన్‌ చేయగా.. ఈ సారి జమకు బదులు అంతేమొత్తం డెబిట్‌ అయ్యింది. టెక్నికల్ ప్రాబ్లెం వల్ల ఇలా జరిగిందని నమ్మబలికిన వర్మ.. మరో సారి రూ.5,200 క్యూఆర్ కోడ్‌ను పంపాడు. ఈసారి రూ. 5200కు బదులు సిద్ధార్ధ్‌ ఖాతా నుంచి భారీ మొత్తంలో డబ్బు డెబిట్‌ అయింది. ఇలా సిద్ధార్ధ్‌ మొత్తం రూ.1.9 లక్షల డబ్బు పోగొట్టుకున్నాడు. లబ్దిదారునిగా బ్యాంక్ ఖాతాను జోడించమని వర్మ సిద్దార్థ్‌ను అడిగే వరకు సిద్దార్థ్‌కు అనుమానం రాలేదు. వెంటనే తన అకౌంట్‌ను బ్లాక్‌ చేసి, సైబర్ హెల్ప్‌లైన్, స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు.

ఇదే తరహాలో మరో వ్యక్తి కూడా ఘోరంగా మోసపోయాడు. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ కూడా అదే రోజు క్యూఆర్ కోడ్ స్కామ్‌తో భారీగా మోసపోయాడు. అతని భార్య OLXలో ఇన్వర్టర్, బ్యాటరీని అమ్మకానికి పెట్టింది. స్కామర్ కొనుగోలుదారుగా నటిస్తూ QR కోడ్‌లను పంపాడు. ఈ జంట ఖాతా నుండి రూ. 46,000 కాజేశారు. సైబర్‌ నేరాలు పెరిగిపోతున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.