Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trainee Doctor: మెడికల్‌ కాలేజీ బిల్డింగ్‌ 5వ అంతస్తు నుంచి దూకిన ట్రైనీ వైద్యురాలు.. ఏం జరిగిందో?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ట్రైనీ వైద్యురాలి ఘటన మరువక ముందే తమిళనాడులో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుతున్న ట్రైనీ వైద్యురాలు క్యాంపస్‌లోని బిల్డింగ్‌ ఐదో అంతస్తు నుంచి కిందకు దూకేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ.. అక్కడ మృతి చెందింది. తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో..

Trainee Doctor: మెడికల్‌ కాలేజీ బిల్డింగ్‌ 5వ అంతస్తు నుంచి దూకిన ట్రైనీ వైద్యురాలు.. ఏం జరిగిందో?
Trainee Doctor
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 02, 2024 | 9:07 PM

చెన్నై, సెప్టెంబర్ 2: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ట్రైనీ వైద్యురాలి ఘటన మరువక ముందే తమిళనాడులో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుతున్న ట్రైనీ వైద్యురాలు క్యాంపస్‌లోని బిల్డింగ్‌ ఐదో అంతస్తు నుంచి కిందకు దూకేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ.. అక్కడ మృతి చెందింది. తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

తమిళనాడులోని తిరునెల్వేలికి చెందిన షెర్లిన్ (23) కాంచీపురం జిల్లాలోని మీనాక్షి మెడికల్ కాలేజీలో ఐదో సంవత్సరం చదువుతుంది. అదే ప్రైవేట్‌ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌గా షెర్లిన్‌ విధులు నిర్వహిస్తోంది. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ ఆదివారం రాత్రి మెడికల్‌ కాలేజీ క్యాంపస్‌లోని బిల్డింగ్‌ ఐదో అంతస్తు కిటికీ వద్ద షెర్లిన్ చాలా సేపు కూర్చుని ఉండటాన్ని కొంత మంది విద్యార్థులు గమనించారు. అయితే ఆమె అకస్మాత్తుగా బిల్డింగ్‌ ఐదో అంతస్తు పై నుంచి కిందకు దూకింది. తీవ్రంగా గాయపడిన ట్రైనీ డాక్టర్‌ను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గంటల వ్యవధిలోనే ఆమె మరణించింది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. షెర్లిన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆమె డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లుగా తెలిసిందని ఓ పోలీస్‌ అధికారి మీడియాకు వెల్లడించారు. షెర్లిన్‌ కాలేజీలోని ఐదో అంతస్తు కిటికీ వద్ద చాలా సేపటి నుంచి కూర్చుని ఉన్నట్లు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. అయితే ఎవరూ ఆమెను సంప్రదించడానికి, ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించలేదు. అయితే షెర్లిన్‌ నిజంగానే వ్యక్తిగత కారణాల వల్ల డిప్రెషన్‌తో బాధపడుతుందా? ఇదేమైనా కట్టుకథ అనే విషయం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

కాగా గత నెల కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో ట్రైనీ వైద్యురాలి హత్యాచార కేసు ఇప్పటి వరకూ అదీగతీ లేకుండా నడుస్తోంది. నెల రోజులు గడుస్తున్నా కేసులో నిందితుల వివరాలు బయటికి రాలేదు. నామమాత్రంగా సంజయ్‌ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసినా.. అసలు దొంగలు ఇంకా బయటికి రాలేదన్నది పలువురి అనుమానం.  దేశ వ్యాప్తంగా అమ్మాయిలపై ఇలాంటి అఘాయిత్యాలు నిత్యం లెక్కలేనన్ని జరుగుతున్నా శాంతి భద్రతల విషయంలో అటు కేంద్రాలు, ఇటు రాష్ట్రాలు విఫలం అవుతూనే ఉన్నాయి. ఈ స్వతంత్ర దేశంలో అమ్మాయిలకు ఎప్పటికీ భద్రత దొరికేనో..?

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.