Viral: జైలుకు కొడుకును కలిసేందుకు వచ్చిన మహిళ వింత ప్రవర్తన.. ఆమె హ్యాండ్ బ్యాగ్ చెక్ చేయగా

ఏ తల్లి అయినా కొడుకు బాగుపడాలని కోరుకుంటుంది. చెడు మార్గం పడితే మారేందుకు దేవుళ్లకు మొక్కుతుంది. కానీ ఈ తల్లి మాత్రం చాలా డిఫరెంట్. తప్పుడు పనులు చేసి జైల్లో ఉన్న కొడుకుని చూసేందుకు వెళ్లి.. ఏం చేసిందంటే..?

Viral: జైలుకు కొడుకును కలిసేందుకు వచ్చిన మహిళ వింత ప్రవర్తన.. ఆమె హ్యాండ్ బ్యాగ్ చెక్ చేయగా
Jail (Representative image)
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 05, 2024 | 7:05 PM

కేరళలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొడుకులు చెడు వ్యసనాలకు బానిసైతే.. తల్లిదండ్రులు మందలిస్తారు. డిఎడిక్షన్ సెంటర్లకైనా పంపి.. వారు బాగుపడేలా ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఓ మహాతల్లి జైల్లో ఉన్న కొడుక్కి గంజాయి అందించేందుకు విశ్వ ప్రయత్నం చేసి.. అధికారులకు చిక్కింది. తన కుమారుడు ఖైదీగా ఉన్న వియ్యూరు సెంట్రల్ జైలులోకి గంజాయిని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన 47 ఏళ్ల మహిళను మంగళవారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తిరువనంతపురంలోని పన్నియోడ్‌కు చెందిన లత తన హ్యాండ్‌బ్యాగ్‌లో దాచిన 80 గ్రాముల గంజాయిని ఎక్సైజ్ బృందం పట్టుకుంది.

ఎక్సైజ్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం, లత కుమారుడు హరికృష్ణన్ ప్రస్తుతం కేరళ సామాజిక వ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం కింద జైలు నిర్బంధంలో ఉన్నాడు. కుమారుడిని చూసేందుకు జైలుకు వస్తున్న లత తన కుమారుడికి గంజాయి తీసుకురావడానికి ప్రయత్నిస్తుందని ఎక్సైజ్ శాఖకు పక్కా సమాచారం అందింది. దీంతో ఎక్సైజ్‌ బృందం కాపు కాసి.. తనిఖీ చేయగా ఆమె హ్యాండ్‌బ్యాగ్‌లో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఆమెను అరెస్టు చేసి స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. విచారణలో లత గతంలో రెండుసార్లు జైలుకు గంజాయి తీసుకొచ్చినట్లు అంగీకరించినట్లు ఓ అధికారి తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..