Cannibal: నరమాంస భక్షకుడి కలకలం.. తోడేలులా ప్రవర్తిస్తూ జనాలపై దాడి

గత 45 రోజులుగా ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌ చుట్టుపక్కల గ్రామస్థులు కంటిమీద కునుకులేకుండా భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. నరమాంస భక్షక తోడేళ్లు ఈ దాడులకు పాల్పడుతున్నట్లు అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పటికే 8 మంది పిల్లలు, ఓ మహిళ మృతి చెందగా, పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. సమీపంలోని అడవుల్లో నుంచి తోడేళ్లు జనావాసాల్లోకి ప్రవేశించి దాడులకు పాల్పడుతున్నట్లు అందరూ..

Cannibal: నరమాంస భక్షకుడి కలకలం.. తోడేలులా ప్రవర్తిస్తూ జనాలపై దాడి
Cannibal
Follow us

|

Updated on: Sep 04, 2024 | 4:03 PM

ముజఫర్‌నగర్‌, సెప్టెంబర్‌ 4: గత 45 రోజులుగా ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌ చుట్టుపక్కల గ్రామస్థులు కంటిమీద కునుకులేకుండా భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. నరమాంస భక్షక తోడేళ్లు ఈ దాడులకు పాల్పడుతున్నట్లు అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పటికే 8 మంది పిల్లలు, ఓ మహిళ మృతి చెందగా, పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. సమీపంలోని అడవుల్లో నుంచి తోడేళ్లు జనావాసాల్లోకి ప్రవేశించి దాడులకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం ‘ఆపరేషన్‌ భేడియా’ కూడా చేపట్టింది. సుమారు 25 నుంచి 30 గ్రామాల ప్రజలు భయంతో గజగజ వణికిపోయారు. ఇప్పటికే నాలుగు తోడేళ్లను బంధించగా.. మరో రెండింటి కోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే ముజఫర్‌నగర్‌లో ఓ షాకింగ్‌ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఇక్కడ దాడులకు పాల్పడుతోంది తోడేలో, కుక్కోకాదని, ఓ యువకుడని, అతడు నరమాంస భక్షకుడిగా మారి పలువురిని కొరికి చంపుతున్నట్లు గుర్తించారు. నరమాంస భక్షకుడిగా మారిన యువకుడు ఇప్పటికే ఓ మహిళ, బాలికతో సహా పలువురిని కరిచాడు. స్థానికులు గమనించి అతికష్టం మీద అతడి నుంచి వారిని కాపాడారు. దీంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. కొందరు స్థానికులు యువకుడిని తాడుతో కట్టేసి పోలీసులకు అప్పగించారు.

ముజఫర్‌నగర్‌లోని కొత్వాలి ప్రాంతంలోని రామ్‌లీలా తిల్లా గ్రామంలో బుధవారం తెల్లవారుజామున ఓ యువకుడు వన్యప్రాణిలా ప్రవర్తిస్తూ మార్కెట్‌కు వస్తున్న వారిపై కోతుల మాదిరిగా దాడి చేయడం కలకలం రేపింది. కొద్దిసేపటికే ఆ యువకుడు డజన్ల కొద్దీ వ్యక్తులపై దాడి చేసి పళ్లతో కొరికి గాయపరిచాడు. పరిగెత్తుకుంటూ వచ్చి దొరికిన వారిని దొరికినట్లు పట్టుకుని పళ్లతో కొరికి పారిపోతున్నాడు. యువకుడి వింత ప్రవర్తన చూసి చిన్నారులు, వృద్ధులు, మహిళలు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. కొందరు ధైర్యం చేసి ఆ యువకుడిని పట్టుకుని తాడుతో కట్టేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు యువకుడిని పట్టుకుని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స తర్వాత యువకుడిని మీరట్ మెడికల్‌కు రెఫర్ చేశారు.

ఇవి కూడా చదవండి

సదరు యువకుడి కుటుంబ సభ్యులను విచారించిన అధికారులకు విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. యువకుడు మద్యం, డ్రగ్స్‌కు బానిసయ్యాడని, నిత్యం మద్యం మత్తులో ఉండడం వల్ల అతడి భార్య కూడా అతడిని వదిలి వెళ్లిపోయిందని తెలిపారు. మద్యం వ్యసనం మాన్పించడానికి యువకుడికి అతని కుటుంబ సభ్యులు కొన్ని మందులు వాడటం వల్ల.. అవి వికటించడంతో యువకుడు అలాంటి పరిస్థితికి చేరుకున్నట్లు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

69 సినిమానే ని నమ్ముకున్న దళపతి విజయ్.! ఎందుకు అంత నమ్మకం.
69 సినిమానే ని నమ్ముకున్న దళపతి విజయ్.! ఎందుకు అంత నమ్మకం.
అమెరికాకు ప్రధాని మోడీ.. కలుస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు..
అమెరికాకు ప్రధాని మోడీ.. కలుస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు..
మహిళా వేధింపుల కమిటీపై హీరోయిన్ కామెంట్స్.! ఎలాంటి కమిటీలు వద్దు!
మహిళా వేధింపుల కమిటీపై హీరోయిన్ కామెంట్స్.! ఎలాంటి కమిటీలు వద్దు!
రోగికి ‘అదుర్స్‌’ సినిమా చూపిస్తూ.. మెదడులోని కణితి తొలగింపు
రోగికి ‘అదుర్స్‌’ సినిమా చూపిస్తూ.. మెదడులోని కణితి తొలగింపు
తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్..శుభవార్త ఎలా చెప్పిందో చూశారా?
తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్..శుభవార్త ఎలా చెప్పిందో చూశారా?
రిలీజ్‌కు ముందే రికార్డ్స్‌ క్రియేట్ చేసిన దేవర|అసలు ఏది నమ్మాలి?
రిలీజ్‌కు ముందే రికార్డ్స్‌ క్రియేట్ చేసిన దేవర|అసలు ఏది నమ్మాలి?
వెంకన్న భక్తులకు అన్నప్రసాదం ఆ దాతల చలువే.. దాతలకు ఘన సన్మానం
వెంకన్న భక్తులకు అన్నప్రసాదం ఆ దాతల చలువే.. దాతలకు ఘన సన్మానం
మంకీపాక్స్ అలర్ట్.. దేశంలో మరో అనుమానిత కేసు..
మంకీపాక్స్ అలర్ట్.. దేశంలో మరో అనుమానిత కేసు..
సెల్ఫ్ నామినేషన్ దెబ్బ.. డేంజర్‌ జోన్‌లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్
సెల్ఫ్ నామినేషన్ దెబ్బ.. డేంజర్‌ జోన్‌లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్
16 పరుగులకే 5 వికెట్లు.. ద్వీవుల్లో డైనమేట్ బీభత్సం..
16 పరుగులకే 5 వికెట్లు.. ద్వీవుల్లో డైనమేట్ బీభత్సం..