Viral Video: నడిరోడ్డుపై మహిళా డీఎస్పీపై దాడి.. జుట్టు పట్టిలాగి కొట్టిన నిరసనకారులు! వీడియో వైరల్

రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తున్న కొందరు వ్యక్తులను అడ్డుకున్నందుకు విధుల్లో ఉన్న డీఎస్పీ స్థాయి మహిళా పోలీసు అధికారిపై నిరసన కారులు దాడికి తెగబడ్డారు. ఏకంగా జుట్టు పట్టి లాగి కొట్టారు. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సంఘటన తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో మంగళవారం (సెప్టెంబర్ 2) చోటు చేసుకుంది. మహిళా అధికారిపై దాడి చేసిన వీడియో దృశ్యాలు సోషల్‌ మీడియాలో..

Viral Video: నడిరోడ్డుపై మహిళా డీఎస్పీపై దాడి.. జుట్టు పట్టిలాగి కొట్టిన నిరసనకారులు! వీడియో వైరల్
Lady Cop Assaulted By Protestors
Follow us

|

Updated on: Sep 04, 2024 | 3:25 PM

చెన్నై, సెప్టెంబర్‌ 4: రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తున్న కొందరు వ్యక్తులను అడ్డుకున్నందుకు విధుల్లో ఉన్న డీఎస్పీ స్థాయి మహిళా పోలీసు అధికారిపై నిరసన కారులు దాడికి తెగబడ్డారు. ఏకంగా జుట్టు పట్టి లాగి కొట్టారు. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సంఘటన తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో మంగళవారం (సెప్టెంబర్ 2) చోటు చేసుకుంది. మహిళా అధికారిపై దాడి చేసిన వీడియో దృశ్యాలు సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. వివరాల్లోకెళ్తే..

తమిళనాడులోని విరుదునగర్ జిల్లా రామనాథపురానికి చెందిన 35 ఏళ్ల ట్రక్‌ డ్రైవర్‌ కాళికుమార్‌ అనే వ్యక్తిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి హత్య చేశారు. దీనిపై తిరుచ్చూరి పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం ఉదయం నిందితులను అరెస్టు చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు మృతదేహం ఉంచిన ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట నిరసనకు దిగారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో అరుప్పుకోట్టై మార్గంలో బైఠాయించి ఆందోళనకు దిగారు. నిరసనకారులు అరుప్పుకోట్టై ప్రాంతంలోని రహదారిని దిగ్భందించేందుకు యత్నించగా.. డీఎస్పీ గాయత్రి, ఇతర పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారిని చెదరగొట్టేందుకు డీఎస్పీ గాయత్రితోపాటు పలువురు పోలీసులు అడ్డుగా వెళ్లగా.. నిరసనకారుల్లో కొందరు ఆమెపై దాడి చేశారు. డీఎస్పీ జుట్టు పట్టుకుని లాగి కొట్టడంతో మిగిలిన పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆమెను అక్కడి నుంచి తరలించారు. నిరసనకారులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసేందుకు యత్నించగా.. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య భౌతిక వాగ్వాదం చోటు చేసుకుంది.

ఇవి కూడా చదవండి

ఇందుకు సంబంధించిన వైరల్ వీడియో వైరల్ కావడంతో డీఎస్పీ గాయత్రి జుట్టు లాగిన 30 ఏళ్ల బాలమురుగన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతనితోపాటు నిరసనకారుల్లో మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘర్షణలో డీఎస్పీ గాయత్రికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై ఏఐఏడీఎంకే నేత, ప్రతిపక్ష నేత ఎడప్పాడి కె. పళనిస్వామి స్పందిస్తూ.. డీఎంకే ప్రభుత్వాన్ని విమర్శించారు. డీఎంకే పాలనలో అన్యాయం నెలకొందని, పర్యవసానాలకు భయపడకుండా ఎవరైనా దాడి చేయవచ్చని తాజా సంఘటనతో తేలిందన్నాను. ఇప్పుడు ఏకంగా డీఎస్పీ గాయత్రిపై దాడి జరిగిందన్నారు. రాష్ట్రంలో పోలీసులకు కూడా అసురక్షితంగా ఉండే వాతావరణాన్ని సృష్టించిన ముఖ్యమంత్రిని కీలుబొమ్మగా వ్యాఖ్యానించారు. డీఎంకే ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.