Watch: కారులో వెళ్తూ వరదలో చిక్కుకున్న దంపతులు.. గంటల తరబడి నీటిలోనే.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
దేశవ్యాప్తంగా వర్ష బీభత్సం కొనసాగుతోంది. గుజరాత్‌లో వరదల బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. వరదల కారణంగా అపారనష్టం జరిగింది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలోనే గుజరాత్‌లోని సబర్‌కాంత జిల్లాలో కారులో వెళ్తున్న దంపతులు అకస్మాత్తుగా వరదలో చిక్కుకుపోయారు.
దేశవ్యాప్తంగా వర్ష బీభత్సం కొనసాగుతోంది. గుజరాత్‌లో వరదల బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. వరదల కారణంగా అపారనష్టం జరిగింది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలోనే గుజరాత్‌లోని సబర్‌కాంత జిల్లాలో కారులో వెళ్తున్న దంపతులు అకస్మాత్తుగా వరదలో చిక్కుకుపోయారు. ఇదార్ తాలూకాలోని వడియావిర్ – భూటియా గ్రామాల మధ్య ఈ ఘటన జరిగింది. భారీ వరదల మధ్య దంపతులు ఇవతలి ఒడ్డు నుంచి అవతలికి కారులో బయల్దేరారు. అయితే వరద ఒక్కసారిగా ఉప్పొంగడంతో చాలాసేపు మధ్యలోనే ఉండిపోయారు. కాపాడాలని అరుపులు కేకలు వేశారు. వరద భారీగా వస్తుండటంతో ప్రాణాలు కాపాడుకోవడానికి కారు పైకి ఎక్కి కేకలు వేస్తూ ఉండిపోయారు దంపతులు. వారిని కాపాడేందుకు స్థానికులు చాలా ప్రయత్నం చేశారు. వాళ్ల ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీంతో అధికారులకు సమాచారమిచ్చారు. స్పాట్‌కి చేరుకున్న అధికారుల బృందం పడవ సాయంతో దంపతుల్ని రక్షించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..
దంపతులు కారు పైకప్పుపై ఎక్కి వరదలో ఎలా ఉండిపోయారో వీడియోలో చూడండి..
గుజరాత్‌లో నెలరోజులుగా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే అధికారులు అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నా.. కొంతమంది బయటకు వెళ్తే రిస్క్‌లో పడుతున్నారు.
ఇదిలాఉంటే.. రాజస్థాన్‌లో వరుసగా మూడో రోజు కుండపోత వర్షం కురిసింది. రాజధాని జైపూర్‌లో జనజీవితం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదనీటిలో వాహనాలు మునిగాయి. భారీ వర్షం కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అల్వార్ , అజ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అజ్మీర్‌లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. వరద బాధితులను ఆదుకోవడానికి అధికారులు భారీ సహాయక చర్యలు చేపట్టారు.
పశ్చిమబెంగాల్ కూడా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కోల్‌కతాలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..