Nursing Staff Missing Case: నర్సింగ్‌ యువతి మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. నదిలో లభ్యమైన మృతదేహం

ఆర్జీకర్‌ ట్రైనీ డాక్టర్‌ హత్యాచార కేసుకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళన తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసు ఓ కొలిక్కిరాకముందే మరో దారుణం చోటు చేసుకుంది. ముర్షిదాబాద్‌లోని భాగీరథి నదిలో నర్సింగ్‌ స్టాఫ్‌ ఒకరిది మృతదేహం లభ్యం కావడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. సుచిత్రా మోండల్ అనే యువతి బుధవారం నర్సింగ్‌హోమ్‌లో డ్యూటీ ముగించుకుని ఇంటికి..

Nursing Staff Missing Case: నర్సింగ్‌ యువతి మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. నదిలో లభ్యమైన మృతదేహం
Nursing Staff Missing Case
Follow us

|

Updated on: Sep 08, 2024 | 7:40 PM

బహరంపూర్, సెప్టెంబర్‌ 8: ఆర్జీకర్‌ ట్రైనీ డాక్టర్‌ హత్యాచార కేసుకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళన తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసు ఓ కొలిక్కిరాకముందే మరో దారుణం చోటు చేసుకుంది. ముర్షిదాబాద్‌లోని భాగీరథి నదిలో నర్సింగ్‌ స్టాఫ్‌ ఒకరిది మృతదేహం లభ్యం కావడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. సుచిత్రా మోండల్ అనే యువతి బుధవారం నర్సింగ్‌హోమ్‌లో డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి రాలేదు. దీంతో పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. అనూహ్యంగా శనివారం రాత్రి ఆమె మృతదేహాన్ని సతుయ్ సమీపంలోని నదిలో లభ్యమైంది. కనిపించకుండా పోయిన రోజు సుచిత్రలో ఎలాంటి అసాధారణ ప్రవర్తన కనిపించలేదని మృతురాలి కుటుంబీకులు, నర్సింగ్ హోమ్ అధికారులు చెబుతున్నారు. యువతి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిందా? లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా అన్నది తెలియాల్సి ఉంది. మృతురాలు సుచిత్ర ఇల్లు బహరంపూర్ కోడెల గ్రామంలో ఉంది. బహరంపూర్‌లోని నర్సింగ్‌హోమ్‌లో ఆమె 2 సంవత్సరాలకు పైగా నర్సింగ్ సిబ్బందిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 8:30 గంటలకు డ్యూటీ తర్వాత నర్సింగ్‌హోమ్ నుంచి ఇంటికి బయలుదేరింది. ఆ తర్వాత ఆమె ఆచూకీ లభించలేదు. బుధవారం రాత్రి భాగీరథి నది వంతెనపై నుంచి ఎవరో దూకినట్లు స్థానికుల ద్వారా పోలీసులకు తెలిసింది. ఒక జత బూట్లు వంతెనపై కనిపించాయి. ఆ బూట్లు సుచిత్రవేనని ఆమె తల్లి ధృవీకరించింది.

ఇంతకీ సుచిత్ర ఆత్మహత్య చేసుకుందా? లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా? అన్న దానిపై సుచిత్ర తల్లి సోనాలి మోండల్ మాట్లాడుతూ.. ‘నాకు ఎవరిపైనా అనుమానం లేదు. అది ఎలా జరిగిందో తెలుసుకోండి. ఆ రోజు వంట చేసి డ్యూటీకి వెళ్లింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య నాలుగు సార్లు కాల్ చేసింది. సాయంత్రం 7:30కి మళ్లీ ఫోన్ చేసింది. మళ్లీ 8:30కి ఫోన్ చేసి డ్యూటీ అయిపోయిందని, ఇంటికి తిరిగి వస్తున్నానని చెంది. కాలినడకన రాను, ఆటోలో వస్తాను అని చెప్పింది. నర్సింగ్‌ హోమ్‌ నుంచి సుచిత్ర వారానికి 2 రోజులు ఇంటికి వచ్చేదని చెప్పింది. ఎప్పుడూ హుషారుగా కనిపించే సుచిత్ర ఎందుకు చనిపోయిందో తెలియట్లేదని తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. సుచిత్ర తండ్రి మోహన్‌లాల్ మోండల్ మాట్లాడుతూ.. మా అమ్మాయి ఆరోగ్యంగానే ఉంది. వంతెనపై నుండి ఎందుకు దూకిందో పోలీసులు సరైన విచారణ చేసి కనుక్కోవాలి. నాకు ఎవరిపైనా అనుమానం లేదని’ ఆయన చెప్పారు.

ఆ నర్సింగ్‌హోమ్ మేనేజర్ శ్యామ్ అధికారి మాట్లాడుతూ.. ‘సెప్టెంబర్ 4న 2 గంటల ప్రాంతంలో సుచిత్ర నర్సింగ్‌హోమ్‌కి వచ్చింది. రోజంతా డ్యూటీ చేసింది. కొంచెం ఒత్తిడిలో ఉందేమో..రోజంతా కాస్త ముభావంగా కనిపించింది. డ్యూటీ ముగిశాక మామూలుగానే వెళ్లిపోయింది. ఆమె రూమ్‌మేట్స్ రాత్రి 11:00 గంటల సమయంలో సుచిత్రకు ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అయితే సుచిత్ర ఇంటికి వెళ్లిందని రూమ్మేట్స్ అనుకున్నారు. మరుసటి రోజు ఉదయం సుచిత్ర రూమ్మేట్స్ సుచిత్ర ఇంటికి ఫోన్‌ చేయగా.. ఆమె ఇంటికి కూడా వెళ్లలేదని తెలిసింది. అప్పుడు వాళ్లు నాకు ఈ విషయం చెప్పారు. అప్పుడే కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాం. పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు చేసినట్లు వారు చెప్పారని’ఆయన తెలిపారు. నేను ఈ నర్సింగ్‌హోమ్‌లో 2 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్నాను. సుచిత్రకి ఎవరితోనూ ఇక్కడ ఇబ్బంది లేదు. ఘటనపై పూర్తి విచారణ జరిపిస్తే.. దీని వెనుక మరేదైనా విషయం ఉందా? అనేది బయటకు వస్తుందన్నారు.

ఇవి కూడా చదవండి

కాగా శనివారం రాత్రి భాగీరథి నదిలో ఓ యువతి మృతదేహం తేలుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత.. సుచిత్ర కుటుంబీకులు గుర్తించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..