Vasantha Panchami 2022: ఈరోజు వసంత పంచమి.. శుభముహుర్తం.. ప్రాముఖ్యత.. ఆచారాల గురించి తెలుసుకోండి..
వసంత పంచమి (Vasantha Panchami).. దీనినే శ్రీ పంచమి.. మదన పంచమి అని కూడా అంటారు. మాఘమాసంలోని
వసంత పంచమి (Vasantha Panchami).. దీనినే శ్రీ పంచమి.. మదన పంచమి అని కూడా అంటారు. మాఘమాసంలోని శుక్ల పక్షంలోని ఐదవ పంచమి రోజున వసంత పంచమిని జరుపుకుంటారు. ఈరోజు సరస్వతి (Saraswathi) దేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ వసంత పంచమిని హోలీ పండుగకు నలబై రోజుల ముందు జరుపుకుంటారు. ఈ వసంత పంచమి రోజు నుంచి వసంత రుతువు కూడా ప్రారంభమవుతుంది.
శుభముహూర్తం.. ఈ సంవత్సరం వసంత పంచమి శుభముహూర్తం ఉదయం 07.07 నుంచి మధ్యాహ్నం 12.35 వరకు ఉంటుంది. వసంత పంచమి తిథి ఫిబ్రవరి 5న ఉదయం 3.47 గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి 6న తెల్లవారుజామున 3.46 గంటలకు ముగుస్తుంది.
ప్రాముఖ్యత.. ఈరోజున తమ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించమని తెల్లని వస్త్రాలతో సరస్వతి అమ్మవారిని పూజిస్తారు. పాలు, తెల్ల నువ్వులతో చేసిన స్వీట్లను అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. అంతేకాకుండా.. ఈరోజు చిన్నారులతో అక్షరాభ్యాసం చేయిస్తారు. దీంతో వారి ఈరోజు నుంచి విద్యాభ్యాసం వైపు అడుగులు వేస్తారు. అలాగే ఈరోజు చిన్నారులకు వివిధ కళల వైపు వారిని ప్రోత్సాహిస్తారు. ఈరోజున సరస్వతి ఆలయాలలోకి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. ఉత్తరాది.. దక్షిణాది ప్రాంతాల ప్రజలు వసంతి పంచమి నాడు సరస్వతి అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ఈరోజున అమ్మవారికి బంతిపూలతో పూజిస్తారు. ఈరోజున వాగేశ్వరీ,, మహా సరస్వతి, సిద్ధ సరస్వతి, నీల సరస్వతి, ధారణ సరస్వతి , పరా సరస్వతి, బాలా సరస్వతి ఇలా అన్ని రకాల పేర్లతో అమ్మవారిని ధ్యానించడం వలన తల్లి ప్రేమాభిమానాలు ఎక్కువగా పొందుతారు.
Also Read: Mahesh Babu: బుర్జ్ ఖలీఫాపై మహేష్ స్టంట్ .. ఆకట్టుకుంటున్న సూపర్ స్టార్ న్యూ యాడ్..
Rajasekhar: మీ ఆశీస్సుల వల్లే బతికున్నాను.. శేఖర్ సినిమా సాంగ్ లాంఛ్‌లో రాజశేఖర్ భావోద్వేగం..