Basara: బాసరలో ఘనంగా వసంత పంచమి వేడుకలు.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం..

చదువుల తల్లి సరస్వతి పుట్టినరోజు సందర్భంగా అదిలాబాద్‌ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర ఆలయం(Basara Temple) లో వసంత పంచమి (Vasantha Panchami) వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి .

Basara: బాసరలో ఘనంగా వసంత పంచమి వేడుకలు.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం..
Basara Temple
Follow us
Basha Shek

|

Updated on: Feb 05, 2022 | 7:24 AM

చదువుల తల్లి సరస్వతి పుట్టినరోజు సందర్భంగా అదిలాబాద్‌ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర ఆలయం(Basara Temple) లో వసంత పంచమి (Vasantha Panchami) వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి . తెల్లవారు జాము ఒకటిన్నర గంటలకు మంగళవాయిద్యసేవ, సుప్రభాత సేవలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారికి చండీవాహనం, వేదపారాయణంతో పాటు మహా పూజలు నిర్వహిస్తున్నారు. కాగా జ్ఞాన సరస్వతి (Saraswathi) అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాలకు అర్ధరాత్రే బాసరకు చేరుకున్న భక్తులు గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇక అమ్మవారి చెంత అక్షరాభ్యాసం చేయిస్తే విద్యాబుద్ధులు దండిగా ఉంటాయని భక్తుల అపారనమ్మకం. ఇందులో భాగంగా అక్షర శ్రీకార మండపంలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు ఉదయం నాలుగు గంటలకే ప్రారంభమయ్యాయి. కాగా అమ్మవారి జన్మనక్షత్రం కావడంతో బాసర వాగ్దేవి.. సరస్వతి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతోంది.

కాగా దేవాదాయశాఖ తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉదయం 8 గంటలకుకాగా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అమ్మవారి దర్శనానికి మూడు క్యూలైన్లను అధికారులు సిద్ధం చేశారు. కాగా ఏటా మాఘ శుద్ధ పంచమి నాడు వసంత పంచమిని జరుపుకుంటారు. ఆ రోజు చదువుల తల్లి సరస్వతి దేవిని ప్రతిఒక్కరు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ముఖ్యంగా చాలా మంది తల్లిదండ్రులు ఈ రోజున తమ పిల్లలకు సరస్వతీ మాతా దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. ఎందుకంటే.. అమ్మవారి దగ్గర అక్షరాభ్యసం చేయించడం వల్ల పిల్లలకు విద్యాబుద్ధులు బాగా అబ్బుతాయని తల్లిదండ్రుల అపారనమ్మకం. అంతేకాదు వసంత పంచమి రోజు నుంచే వసంత రుతువు కూడా ప్రారంభమవుతుంది.

Also Read:Vijayawada: గన్నవరం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఘరానా మోసం.. తప్పుడు పత్రాలతో రూ.10 లక్షలకు టోకరా పెట్టిన అసిస్టెంట్‌ మేనేజర్‌..

Horoscope Today: ఆ రాశుల వారికి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశిఫలాలు..

Under-19 World Cup 2022: తుది పోరుకు సిద్ధమైన భారత అండర్-19 జట్టు.. ఐదోసారి టైటిల్ గెలిచేనా..