AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Under-19 World Cup 2022: తుది పోరుకు సిద్ధమైన భారత అండర్-19 జట్టు.. ఐదోసారి టైటిల్ గెలిచేనా..

అండర్-19 ప్రపంచకప్‌లో యాష్ ధుల్ నేతృత్వంలోని భారత U19 జట్టు దూసుకెళ్తుంది. శనివారం U19 WC 2022 ఫైనల్‌లో భారత జట్టు ఇంగ్లాండ్‌తో తలపడనుంది.

Under-19 World Cup 2022: తుది పోరుకు సిద్ధమైన భారత అండర్-19 జట్టు.. ఐదోసారి టైటిల్ గెలిచేనా..
Under 19
Follow us
Srinivas Chekkilla

| Edited By: Ravi Kiran

Updated on: Feb 05, 2022 | 6:54 AM

అండర్-19 ప్రపంచకప్‌లో యాష్ ధుల్ నేతృత్వంలోని భారత U19 జట్టు దూసుకెళ్తుంది. శనివారం U19 WC 2022 ఫైనల్‌లో భారత జట్టు ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ఫైనల్‌లో గెలిచి ఐదో టైటిల్‌ను ఎగరేసుకుపోవాలని ఇండియా చూస్తుంది.14 ఎడిషన్లలో ఎనిమిది సార్లు ఫైనల్స్‌కు వెళ్లిన భారత్ నాలుగు సార్లు అండర్-19 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఇదే ఊపులో ఐదో టైటిల్‌ను సాధించాలని ఆటగాళ్లు చూస్తున్నారు. అయితే ఆంగ్లేయ జట్టు కూడా గట్టిగానే ఉంది. వారు ఆకట్టుకునే ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకున్నారు. సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో ఇంగ్లాండ్‌పై ఆధిపత్యం చెలాయించాలని యష్ ధుల్ అండ్ కో చూస్తోంది. కోవిడ్-19 కారణంగా కెప్టెన్ ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్ మూడు లీగ్ గేమ్‌లలో రెండింటికి దూరమైనప్పటికీ భారత్ సాఫీగా ఫైనల్‌కు చేరుకుంది. కరోనా లక్షణాలను కలిగి ఉన్న ధుల్ సెమీఫైనల్‌లో అద్భుతమైన సెంచరీ సాధించాడు.

రషీద్ బ్యాట్‌తో కూడా తన ప్రతిభను కనబరిచాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్‌లో ఓపెనర్ అంగ్క్రిష్ రఘువంశీ, హర్నూర్ సింగ్ నెమ్మదిగా ఆడారు. ఫైనల్‌ కోసం ఇద్దరూ తమ విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆస్ట్రేలియాపై పేలవమైన ఆరంభం తర్వాత ధూల్, రషీద్ బ్యాటింగ్ చేసిన విధానం జట్టుకు ఒక పాఠం. శనివారం జరిగే ఫైనల్‌లో ప్రత్యేక ప్రదర్శన కనబరిచిన వారికి మెగా వేలంలో డిమాండ్ ఉండే అవకాశం ఉంది. బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజ్వర్ధన్ హంగర్గేకర్ పేస్, లెఫ్ట్ ఆర్మర్ రవి కుమార్ స్వింగ్ టాప్ ఆర్డర్ బ్యాటర్లను గడగడలాడించగా, వికీ ఓస్త్వాల్ నేతృత్వంలోని స్పిన్ దాడి మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. అతను 10.75 సగటుతో భారత్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

2008లో భారత్ U-19 టైటిల్‌కు నాయకత్వం వహించిన తర్వాత ప్రపంచ బ్యాటర్‌గా మారిన విరాట్ కోహ్లీ, 2022లో హై ప్రెజర్ ఫైనల్‌కు ఎలా చేరుకోవాలో యువ ఆటగాళ్లు చెప్పాడు. ఇంగ్లాండ్‌ చివరిగా 1998లో టైటిల్ పోరుకు చేరుకుంది. ఆ జట్టు ఒక్కసారి మాత్రమే ట్రోఫీని గెలుచుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సెమీఫైనల్‌లో ఉత్కంఠభరిత ముగింపు తర్వాత ఇంగ్లాండ్ గత 24 ఏళ్ల టైటిల్ కరువును ముగించడానికి మరింత ఆసక్తిగా ఉంది. కెప్టెన్ టామ్ పెర్స్ట్ 73 సగటుతో 292 పరుగులతో ముందుండగా, ఎడమచేతి వాటం పేసర్ జాషువా బోడెన్ 9.53 సగటుతో 13 వికెట్లు పడగొట్టాడు. కాగా, ఈ ఫైనల్ మ్యాచ్ ను రా.6.30 గంటల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌ ఛానల్ లో వీక్షించవచ్చు. జట్లు: భారత్: యశ్ ధుల్ (కెప్టెన్), హర్నూర్ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, షేక్ రషీద్, నిశాంత్ సింధు, సిద్దార్థ్ యాదవ్, అనీశ్వర్ గౌతమ్, మానవ్ పరాఖ్, కౌశల్ తాంబే, రాజవర్ధన్ హంగర్గేకర్, విక్కీ ఓస్త్వాల్, గర్వ్ సాంగ్వాన్, దినేష్ బనా, ఆరాధ్య యాదవ్, ఆరాధ్య యాదవ్, వాసు వత్స్, రవి కుమార్

దక్షిణాఫ్రికా: టామ్ పెర్స్ట్ (కెప్టెన్), జార్జ్ బెల్, జాషువా బోడెన్, అలెక్స్ హోర్టన్, రెహాన్ అహ్మద్, జేమ్స్ సేల్స్, జార్జ్ థామస్, థామస్ ఆస్పిన్‌వాల్, నాథన్ బార్న్‌వెల్, జాకబ్ బెథెల్, జేమ్స్ కోల్స్, విలియం లక్స్టన్, జేమ్స్ రెవ్, ఫతే సింగ్, బెంజమిన్ క్లిఫ్.

Read Also.. Sourav Ganguly: జట్టు ఎంపికలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ పాత్ర ఉందా.. వైరల్ అవుతున్న ఫొటో..