AUS vs PAK: కొత్త కోచ్‌తో పాక్ పర్యటనకు ఆస్ట్రేలియా టీం.. జస్టిస్ లాంగర్ వారసుడు ఎవరంటే?

Justin Langer: పాక్ టూర్‌కు ముందు లాంగర్ రాజీనామాతో క్రికెట్ ఆస్ట్రేలియాలో భూకంపం వచ్చింది. అయితే వెంటనే స్పందించిన ఆస్ట్రేలియా.. కొత్త కోచ్‌ను నియమించింది.

AUS vs PAK: కొత్త కోచ్‌తో పాక్ పర్యటనకు ఆస్ట్రేలియా టీం.. జస్టిస్ లాంగర్ వారసుడు ఎవరంటే?
Aus Vs Pak Justin Langer, Andrew Mcdonald
Follow us
Venkata Chari

|

Updated on: Feb 05, 2022 | 10:36 AM

Justin Langer: ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్(Justin Langer) రాజీనామా చేశారు. జూన్‌ వరకు ఒప్పందం ఉన్నా.. ఫిబ్రవరిలోనే తను జట్టు కోచింగ్ బాధ్యతలనుంచి తప్పుకున్నాడు. పాక్ టూర్‌కు ముందు లాంగర్ రాజీనామా తర్వాత, ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టుకు కోచ్‌గా ఎవరు వ్యవహరిస్తారనే ప్రశ్న తలెత్తింది. అయితే వెంటనే క్రికెట్ ఆస్ట్రేలియా కూడా కొత్త కోచ్‌ను నియమించింది. లాంగర్ రాజీనామా చేసిన వెంటనే, క్రికెట్ ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌(Andrew McDonald )ను తాత్కాలిక కోచ్‌(Intrim Coach)గా నియమించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ట్వీట్ చేసింది. మెక్‌డొనాల్డ్ ఇప్పటి వరకు ఆస్ట్రేలియా జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా ఉన్నారు. కానీ, లాంగర్ రాజీనామా తర్వాత, అతను పదోన్నతి పొందాడు.

జస్టిన్ లాంగర్ రాజీనామా గురించి DSEG సమాచారం అందించింది. శుక్రవారం సాయంత్రం జరిగిన సుదీర్ఘ సమావేశం తర్వాత లాంగర్ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు కంపెనీ తెలిపింది. లాంగర్ కోచింగ్‌లో, ఆస్ట్రేలియా టీ20 ప్రపంచ కప్‌ను మొదటిసారి గెలుచుకోవడం నుంచి యాషెస్‌లో 4-0 విజయం వరకు ప్రధాన విజయాలను నమోదు చేసింది.

ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ను తాత్కాలిక కోచ్‌.. మార్చిలో పాకిస్థాన్‌లో ఆస్ట్రేలియా పర్యటన జరగనుంది. ఈ పూర్తి స్థాయి పర్యటనకు ముందు, ప్రధాన కోచ్ నియామకం కష్టంగా అనిపించింది. ఇటువంటి పరిస్థితిలో, క్రికెట్ ఆస్ట్రేలియా ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ను తాత్కాలిక కోచ్‌గా నియమించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటించింది.

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ కోచ్‌గా.. ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్‌ నుంచి తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్న ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ను ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ కోచ్‌గా నియమించిన సంగతి తెలిసిందే. అయితే, ఒక సీజన్ తర్వాత, ఫ్రాంచైజీ అతన్ని కోచ్ పదవి నుంచి తొలగించింది.

మెక్‌డొనాల్డ్స్ అనుభవం గురించి మాట్లాడితే, 40 ఏళ్ల ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌కు ఆస్ట్రేలియా తరపున 4 టెస్టులు మాత్రమే ఆడిన అనుభవం ఉంది. ఈ 4 టెస్టుల్లో ఆల్‌రౌండర్‌గా 107 పరుగులు చేసి 9 వికెట్లు పడగొట్టాడు. 15 ఏళ్ల పాటు క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న ఆండ్రూ మెక్‌డొనాల్డ్ 2019లో జస్టిన్ లాంగర్‌కు అసిస్టెంట్‌గా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో చేరాడు. లాంగర్ రాజీనామా తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో అతని కొత్త పాత్ర ఎంతవరకు సరిపోతుందో చూడాలి.

Also Read: Under-19 World Cup 2022: తుది పోరుకు సిద్ధమైన భారత అండర్-19 జట్టు.. ఐదోసారి టైటిల్ గెలిచేనా..

Sourav Ganguly: జట్టు ఎంపికలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ పాత్ర ఉందా.. వైరల్ అవుతున్న ఫొటో..