- Telugu News Photo Gallery Cricket photos U19 World Cup 2022, IND vs ENG: India vs England Head to Head Records Yash Dhull
U19 World Cup, IND vs ENG, Head to Head Records: భారత్ వర్సెస్ ఇంగ్లండ్ పోరులో రికార్డులు ఎలా ఉన్నాయంటే?
అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్-ఇంగ్లండ్ మధ్య ఇదే తొలి పోరు. టోర్నీ చరిత్రలో ఇంగ్లండ్ జట్టుకు ఇది రెండో ఫైనల్ కాగా, భారత్‌కు 8వ ఫైనల్.
Updated on: Feb 05, 2022 | 11:20 AM

నేడు అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్. ఇందులో భారత్ గెలుస్తుందా లేక ఇంగ్లండ్ గెలుస్తుందా అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన పరస్పర పోరులో ఎవరిది పైచేయిగా ఉందో ఇప్పుడు చూద్దాం.

అండర్ 19 ప్రపంచకప్ వేదికగా నేడు భారత్, ఇంగ్లండ్ 9వ సారి తలపడనున్నాయి. ఇంతకు ముందు ఆడిన 8 మ్యాచ్‌ల్లో భారత్ ఆధిక్యంలో నిలిచింది. భారత్ 6 మ్యాచ్‌లు గెలవగా, ఇంగ్లండ్ 2 మ్యాచ్‌లు గెలిచింది.

అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్-ఇంగ్లండ్ మధ్య ఇదే తొలి పోరు. టోర్నీ చరిత్రలో ఇంగ్లండ్ జట్టుకు ఇది రెండో ఫైనల్. అంతకుముందు మొదటి ఫైనల్‌ను 24 సంవత్సరాల క్రితం అంటే 1998లో న్యూజిలాండ్‌పై ఆడి, అందులో గెలుపొందింది. అంటే ఫైనల్ పోరులో ఇంగ్లండ్ విజయాల శాతం 100గా నిలిచింది.

ఇది భారత్‌కు 8వ ఫైనల్ కావడం విశేషం. ఇప్పటి వరకు ఏ జట్టు కూడా ఇన్ని ఫైనల్స్ ఆడలేదు లేదా గెలవలేదు. ఇంతకు ముందు ఆడిన 7 ఫైనల్స్‌లో భారత్ 4 గెలిచింది. అంటే, టీమిండియా టైటిల్‌ను 3 సార్లు మాత్రమే కోల్పోయింది. భారత జట్టుకు ఇది వరుసగా నాలుగో ఫైనల్ కూడా.

అండర్ 19 ప్రపంచకప్‌లో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన ఓవరాల్ గణాంకాల గురించి చెప్పాలంటే, ఈరోజు ఇరు జట్ల మధ్య 50వ పోరు జరగనుంది. ఇంతకు ముందు ఆడిన 49 మ్యాచ్‌ల్లో భారత్ 37 గెలిచింది. కేవలం 11 మ్యాచుల్లో మాత్రమే ఇంగ్లండ్ గెలిచింది. ఇందులో ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు.





























