Vijayawada: గన్నవరం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఘరానా మోసం.. తప్పుడు పత్రాలతో రూ.10 లక్షలకు టోకరా పెట్టిన అసిస్టెంట్ మేనేజర్..
కంచె చేను మేసినట్లు బ్యాంకు సిబ్బందే బ్యాంకును బురిడీ కొట్టించాడు. బ్యాంకులో నగలు తనఖా పెట్టినట్లు నకిలీ పత్రాలు సృష్టించి ఘరానా మోసాని (Cheating) కి పాల్పడ్డాడు. వాటితో ఏకంగా రూ. 10 లక్షలకు టోకరా పెట్టాడు.
కంచె చేను మేసినట్లు బ్యాంకు సిబ్బందే బ్యాంకును బురిడీ కొట్టించాడు. బ్యాంకులో నగలు తనఖా పెట్టినట్లు నకిలీ పత్రాలు సృష్టించి ఘరానా మోసాని (Cheating) కి పాల్పడ్డాడు. వాటితో ఏకంగా రూ. 10 లక్షలకు టోకరా పెట్టాడు. విజయవాడ (Vijayawada) పరిధిలోని గన్నవరం (Gannavaram) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఈ ఘరానా మోసం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు పూర్తి వివరాలిలా ఉన్నాయి.. గుణదలకు చెందిన వెంకట ప్రసాద్ అనే వ్యక్తి గన్నవరం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఎటువంటి బంగారు ఆభరణాలు తనఖా పెట్టకుండానే నకిలీ పత్రాలతో రూ. 10 లక్షలు తీసుకున్నాడు. అయితే అనుమానం వచ్చిన ఇతర బ్యాంకు సిబ్బంది బంగారు ఆభరణాలపై ఆరా తీశారు. అయితే బ్యాంకులో ఎటువంటి నగలు కనిపించకపోవడంతో అసలు వ్యవహారం బయటపడింది.
కాగా బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ వెంకట ప్రసాదే ఈ ఘరానా మోసానికి పాల్పడ్డాడని బ్యాంకు ప్రతినిధులు గుర్తించారు. అనంతరం ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. ఈ మేరకు బ్యాంకు ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదుతో బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ వెంకట ప్రసాద్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఘరానా మోసంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శివాజీ తెలిపారు.
Also Read:PM Narendra Modi: నేడే ప్రధాని మోడీ రాక.. స్వాగతం పలకనున్న సీఎం కేసీఆర్.. షెడ్యూల్ ఇలా..
Gold, Silver Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. దిగి వచ్చిన బంగారం, వెండి ధరలు
Viral Video: జూలో కోతి ముందు ఓ వ్యక్తి మ్యాజిక్.. కోతి రియాక్షన్ వీడియో నెట్టింట్లో వైరల్..