Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. ఇంట్లో కూర్చున్న వరించనున్న అదృష్టం..

Astrology: గ్రహాలకు రాజు సూర్య భగవానుడు. భూమిపై శక్తికి మూల వనరు. ఇక బృహస్పతి జ్ఞానం, అభివృద్ధి, అదృష్టానికి మూలంగా పేర్కొంటారు. అయితే, ఈ రెండు గ్రహాలు అగ్ని మూలకానికి చెందినవి.

Astrology: ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. ఇంట్లో కూర్చున్న వరించనున్న అదృష్టం..
Zodiac Signs
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 31, 2023 | 8:09 AM

గ్రహాలకు రాజు సూర్య భగవానుడు. భూమిపై శక్తికి మూల వనరు. ఇక బృహస్పతి జ్ఞానం, అభివృద్ధి, అదృష్టానికి మూలంగా పేర్కొంటారు. అయితే, ఈ రెండు గ్రహాలు అగ్ని మూలకానికి చెందినవి. అయితే, ఈ రెండు గ్రహాలు 12 సంవత్సరాత ఇప్పుడు ఒకే రాశిలోకి ప్రవేశిస్తున్నాయి. సూర్యుడు, బృహస్పతి ఒకే రాశిలోకి ప్రవేశిస్తున్నాయి. ఏప్రిల్ 22న మేషరాశిలో బృహస్పతి, సూర్యుడు కలుస్తారు. ఏప్రిల్ 14 లోపు సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తుండగా.. ఏప్రిల్ 22న ఆ రాశిలో సంచరిస్తాడు. అయితే, సూర్యుడు, గురుడు కలయిక వల్ల 5 రాశుల వారి జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయని చెబుబుతున్నారు పండితులు. వారిని అదృష్టం వరిస్తుందన్నారు. మరి ఆ అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

మేషరాశి..

రెండు గ్రహాలు 12 ఏళ్ల తర్వాత ఈ రాశిలో కలవబోతున్నాయి. ఇది చాలా అరుదైన ఘటన. మేషరాశిలో ఈ రెండు గ్రహాలూ శక్తిని పెంచుతాయి. ఈ ప్రభావంతో.. సదరు రాశి వ్యక్తులు తమ తమ పనుల్లో విజయం సాధిస్తారు. చేసే పనులన్నీ విజయవంతం అవుతాయి. కార్యాలయాల్లో తగిన గౌరవం లభిస్తుంది. ప్రమోషన్ కూడా లభించే ఛాన్స్ ఉంది.

మిధునరాశి..

సూర్యుడు, బృహస్పతి కలయిక మిథునం 11వ పాదంలో ఉంటుంది. గ్రహాల కలయిక వలన ఈ రాశివారి ఆదాయం పెరిగే అవకాశం చాలా ఎక్కుగా ఉంది. అనేక విధాలుగా లాభం చేకూరుతుంది. మిథునరాశి వారు సంతోషమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు. ఎప్పటి నుంచో మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఇప్పుడున్నదానికన్నా మంచి ఉద్యోగం పొందే అవకాశం కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

కర్కాటక రాశి..

సూర్యుడు, బృహస్పతి కలయిక కర్కాటక రాశి వారికి వ్యాపారంలో లాభాలను ఇస్తుంది. మంచి ఉద్యోగావకాశాలు పొందవచ్చు. వ్యాపారం చేసే వారికి మంచి లాభాలు వస్తాయి. చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు.

సింహరాశి..

సింహ రాశి వారికి తండ్రితో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్న వారికి ఈ గ్రహాల కలయిక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అదృష్టం వీరి వెన్నంటే ఉంటుంది. సూర్యుడు సింహ రాశికి అధిపతి. అందుకే ప్రతి అంశంలోనూ సానుకూల ఫలితాలు లభిస్తాయి. జీవితంలో విజయం, ఆనందం, శ్రేయస్సు పొందుతారు.

మీనరాశి..

బృహస్పతి, సూర్యుడి కలయిక వల్ల మీనరాశి వారి అంతా శుభమే జరుగుతుంది. వారి ఇల్లు సంతోషం, శ్రేయస్సుతో వెల్లివిరుస్తుంది. వీరు ఉద్యోగరిత్యా ప్రమోషన్ కూడా పొందవచ్చు. ఆర్థిక పరమైన కష్టాలన్నీ తీరుతాయి. ఆర్థికంగా బలపడటమే కాకుండా, బంధుమిత్రల్లో మీ పరపతి పెరగుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..